శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు.. టీ20 ప్రపంచకప్‌కు ధావన్‌ను ఎంపిక చేయను!!

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ సెలక్టర్ శ్రీకాంత్ కృష్ణమాచారి ఓపెనర్ శిఖర్ ధావన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నేను ఉంటే ధావన్‌ను ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయను అని అన్నారు. నా ఓటు కేఎల్ రాహుల్‌కే అని చెప్పకనే చెప్పారు. శ్రీకాంత్ సెలక్టర్‌గా ఉన్న సమయంలోనే 2011లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

ధావన్‌ను ఎంపిక చేయను:
తాజాగా ఓ మీడియా సమావేశంలో శ్రీకాంత్ కృష్ణమాచారి మాట్లాడుతూ టీ20 ప్రపంచకప్ గురించి పలు విషయాలు పంచుకున్నారు. 'శ్రీలంకపై చేసే పరుగులు లెక్కలోకి రావు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నేను ఉంటే.. మరో ఆరు నెలల్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ధావన్‌ను ఎంపిక చేయను. ధావన్, రాహుల్ మధ్య పోటీ లేదు. విజేత ఒక్కడే' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

12 టీ20ల్లో.. 272 పరుగులు:
శిఖర్ ధావన్ గత ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పంచకప్-2019లో ఓ సెంచరీ మినహా మెరుగైన ప్రదర్శన చేయలేదు. మరోవైపు నెమ్మదిగా బ్యాటింగ్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. తరచూ గాయాలపాలై జట్టుకు దూరంగా ఉన్నాడు. గత 12 టీ20ల్లో ధావన్ 110.56 స్ట్రైక్‌రేటుతో 272 పరుగులు చేశాడు. మరోవైపు రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత 9 ఇన్నింగ్స్‌ల్లో 142.40 స్ట్రైక్‌రేటుతో 356 పరుగులు బాదాడు.

ప్రపంచకప్ గెలవడానికి ప్రయత్నిస్తా:
గువాహటిలో శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ... 'గత ఏడాదిలో ఎన్నో గాయాలయ్యాయి. అవన్నీ ఆటలో భాగమే. కొత్త ఏడాదిని నూతనోత్సాహంతో ఆరంభించాలని చూస్తున్నా. ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఆలోచిస్తా. ఈ ఏడాది పరుగులు చేయాలనుకుంటున్నా. ప్రపంచకప్ గెలవడానికి ప్రయత్నిస్తా. శ్రీలంక సిరీస్ నాకో మంచి అవకాశం. ఎప్పుడూ నా ఆటను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తా' అని ధావన్ తెలిపాడు.

మ్యాచ్‌కు వర్షం అంతరాయం:
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలోని బర్సపర స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. పిచ్‌తో పాటు అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ప్రారంభం అవడానికి వీలు కాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో టీ20 ఇండోర్ వేదికగా మంగళవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications