Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens World Cup 2022: చ‌రిత్ర సృష్టించిన ఝుల‌న్ గోస్వామి.. ఏకైక బౌల‌ర్‌గా రికార్డు

Womens World Cup 2022: Team India womens bowler Jhulan Goswami completes 250 wickets in ODI format

టీమిండియా ఉమెన్స్ టీం బౌల‌ర్ ఝుల‌న్ గోస్వామి చ‌రిత్ర సృష్టించింది. వ‌న్డేల్లో 250 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. త‌ద్వారా ఉమెన్స్ క్రికెట్‌లో వ‌న్డేల్లో 250 వికెట్లు తీసిన ఏకైక బౌల‌ర్‌గా అవ‌త‌రించింది. ఉమెన్స్ వ‌న్డే క్రికెట్‌లో ఝుల‌న్ గోస్వామి మిన‌హా మ‌రే బౌల‌ర్‌గా కూడా క‌నీసం 200 వికెట్లు కూడా తీయ‌లేదు. ఉమెన్స్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 39 ఏళ్ల సీనియ‌ర్ పేస‌ర్ గోస్వామి ఈ రికార్డును అందుకుంది.

250 వికెట్లు పూర్తి

250 వికెట్లు పూర్తి

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా భార‌త్, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బ్యూమాంట్‌ను ఔట్ చేయ‌డం ద్వారా ఘుల‌న్ గోస్వామి వ‌న్డే క్రికెట్‌లో 250 వికెట్లు పూర్తి చేసుకుంది. గోస్వామి ఈ రికార్డును 199 వ‌న్డే మ్యాచ్‌ల్లో అందుకుంది. గోస్వామి అత్యుత్త‌మ గ‌ణాంకాలు 6/31గా ఉండ‌గా.. ఆమె రెండు సార్లు 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌, 7 సార్లు 4 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసింది.

ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్, వెస్టిండీస్ స్పిన్నర్ అనిసా మొహమ్మద్ ఘుల‌న్ గోస్వామి తర్వాతి జాబితాలో సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. వీరిద్ద‌రి ఖాతాలో 180 వికెట్ల చొప్పున ఉన్నాయి. ఇక 168 వికెట్ల‌తో సౌతాఫ్రికా బౌల‌ర్ షబ్నిమ్ ఇస్మాయిల్ నాల్గో స్థానంలో, 164 వికెట్ల‌తో ఇంగ్లండ్ బౌల‌ర్ కేథరిన్ బ్రంట్ ఐదో స్థానంలో, 161 వికెట్ల‌తో ఆస్ట్రేలియా బౌల‌ర్ ఎల్లీస్ పెర్రీ ఆరో స్థానంలో ఉన్నారు.

మొత్తంగా ఏడో స్థానం

మొత్తంగా ఏడో స్థానం

పురుషుల‌, మ‌హిళ‌ల‌ను క‌లిపి చూసుకుంటే వ‌న్డేల్లో 250 వికెట్లు తీసిన ఏడో భార‌త బౌల‌ర్‌గా ఘుల‌న్ గోస్వామి నిలిచింది. గోస్వామి కంటే ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253) ఈ రికార్డును అందుకున్నారు. కాగా గ‌త మ్యాచ్‌లో కూడా ఘుల‌న్ గోస్వామి ఓ రికార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఉమెన్స్ వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ఆ మ్యాచ్‌లో ఘుల‌న్ గోస్వామి చ‌రిత్ర సృష్టించింది.

 టీమిండియా ప‌రాజ‌యం

టీమిండియా ప‌రాజ‌యం

ఇక ఉమెన్స్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియాకు మ‌రో ప‌రాజయం ఎదురైంది. ఇంగ్లండ్ ఉమెన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త ఉమెన్స్ జ‌ట్టు 4 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. బ్యాట‌ర్లంతా విఫ‌ల‌మ‌వ‌డంతో భారీ స్కోర్ చేయ‌లేక‌పోయినా టీమిండియాను బౌల‌ర్లు గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ చివ‌రి వ‌ర‌కు ఆడి ఆ జ‌ట్టును గెలిపించింది. ఈ టోర్నీలో భార‌త ఉమెన్స్‌కు ఇది రెండో ప‌రాజ‌యం కాగా, ఇంగ్లండ్ ఉమెన్స్‌కు ఇదే తొలి విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. 4 కీల‌క వికెట్ల‌తో భార‌త్‌ను దెబ్బ‌కొట్టిన షార్లెట్ డీన్‌కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

Story first published: Wednesday, March 16, 2022, 13:37 [IST]
Other articles published on Mar 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+