Womens World Cup 2022: ఒకే మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి

హామిల్టన్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ టీం వెటరన్ ప్లేయర్లు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించారు. ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ప్లేయర్‌గా మిథాలీ రాజ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఝులన్ గోస్వామి అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వీరిద్దరు ఒకే మ్యాచ్‌లో ఈ రికార్డు అందుకోవడం గమనార్హం.

మిథాలీ ప్రపంచ రికార్డు
ఉమెన్స్ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచకప్ టోర్నీలో మిథాలీ 24 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసి ఈ రికార్డును అందుకుంది. తద్వారా గతంలో 23 మ్యాచ్‌లతో ఉన్న ఆస్ట్రేలియా సారథి బెలిండా క్లార్క్ పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. ఈ జాబితాలో 19 మ్యాచ్‌లతో న్యూజిలాండ్ కెప్టెన్ సుసాన్ గోట్‌మాన్ మూడో స్థానంలో ఉంది. కాగా 39 ఏళ్ల మిథాలీ రాజ్ ఈ ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

చరిత్ర సృష్టించిన ఘులన్ గోస్వామి
వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ అనిసా మహమ్మద్‌ను ఔట్ చేయడం ద్వారా ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్‌గా ఘులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు గోస్వామి 40 వికెట్లు పడగొట్టింది. ఘులన్ గోస్వామి తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్స్‌స్టన్ 39 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. 37 వికెట్లతో ఇంగ్లండ్ బౌలర్ కరోల్ హోడ్జెస్ మూడో స్థానంలో ఉంది. కాగా ఘులన్ గోస్వామికి ఇదే చివరి ప్రపంచకప్ కానుండడం గమనార్హం.

భారత్ విజయం
ఇక మ్యాచ్ విషయానికొస్తే మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ మరో విజయాన్నందుకుంది. వెస్టిండీస్ మహిళలతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన మిథాలీ సేన 155 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 123), హిట్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109)సెంచరీలతో కదం తొక్కారు. విండీస్ బౌలర్లలో అనిసా మొహమూద్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూస్, షెకెరా, డియాండ్రా, అలెన్ తలో వికెట్ పడగొట్టారు. 78 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును స్మతి మంధాన, హర్మన్ ప్రీత్ ఆదుకున్నారు. సూపర్ బ్యాటింగ్‌తో నాలుగో వికెట్‌కు 184 పరుగులు జోడించి ఆదుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications