
రికార్డు సమం చేసిన ఝులన్ గోస్వామి
ప్రపంచకప్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ కేటీ మార్టిన్‌ను ఝులన్ గోస్వామి ఔట్ చేసింది. 51 బంతుల్లో 41 పరుగులతో జోరు మీదున్న కేటీ మార్టిన్‌ను ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఝులన్ గోస్వామి బౌల్డ్ చేసింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో 39 వికెట్లను పూర్తి చేసుకుంది. దీంతో ఈ టోర్నీలో 39 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్‌స్టన్ రికార్డును ఝులన్ గోస్వామి అందుకుంది.

ఒక వికెట్ తీస్తే
దీంతో ఈ టోర్నీలో ఝులన్ గోస్వామి ఇంకొక వికెట్ తీస్తే మహిళా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరిస్తుంది. కాగా 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఝులన్ గోస్వామికి ఇది ఐదో వన్డే ప్రపంచకప్. కేటీ మార్టిన్, ఝులన్ గోస్వామి తర్వాత 37 వికెట్లతో ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ కరోల్ హోడ్జెస్ రెండో స్థానంలో ఉంది. 36 వికెట్లతో ఇంగ్లండ్ బౌలర్ క్లేరీ టేలర్ మూడో స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన క్యాథరిన్ ఫిట్జ్ పాట్రిక్ 33 వికెట్లతో నాలుగో స్థానంలో ఉంది.

ఝులన్ గోస్వామి రికార్డులు
భారత్ క్రికెట్ జట్టులో అత్యంత అనుభవజ్ఞురాలైన పేస్ బౌలర్‌గా ఝులన్ గోస్వామి రాణిస్తోంది. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఝులన్ గోస్వామి ఇప్పటివరకు 196 వన్డే మ్యాచ్‌లు ఆడిన 247 వికెట్లు తీసింది. అత్యుత్తమ గణాంకాలు 6/31గా ఉన్నాయి. ఇక 12 టెస్టు మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీసింది. అత్యుత్తమ గణాంకాలు 5/25గా ఉన్నాయి. 68 టీ20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. అత్యత్తమ గణాంకాలు 5/11గా ఉన్నాయి.
టీమిండియా ఓటమి
న్యూజిలాండ్ ఉమెన్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ జట్టు ఓటమి పాలైంది. భారత జట్టుపై 62 పరుగుల తేడాతో కివీస్ మహిళలు విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టులో సాటర్త్‌వైట్ (75), అమేలియా కెర్ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు టార్గెట్‌ను చేధించడంలో విఫలమయ్యారు. 198 పరుగులకే ఆలౌటయ్యారు. భారత మహిళలో హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే 71 పరుగుతో రాణించింది.


Click it and Unblock the Notifications












