
మౌంట్ మాంగనూయ్: ఉమెన్స్ వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ టీం బ్యాటర్లు చేతులెత్తేశారు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మూకుమ్మడిగా విఫలమవడంతో భారత జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. మొత్తం జట్టులో నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండెంకెల స్కోర్ చేశారు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లీష్ బౌలర్లలో షార్లెట్ డీన్ 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఆరంభంలోనే ఇంగ్లీష్ పేస్ బౌలర్ అన్య ష్రూబ్సోల్ దెబ్బకొట్టింది. యాస్తిక భాటియా (8), మిథాలీ రాజ్ (1)ను వరుస ఓవర్లలో ఫెమిలియన్ పంపింది. ఆ కాసేపటికే దీప్తిశర్మ కూడా రనౌట్ అవడంతో టీమిండియా 28 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో ఓపెనర్ స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 17వ ఓవర్లో షార్లెట్ డీన్ దెబ్బకొట్టింది. ఒకే ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ (14), స్నేహ్ రానా (0)ను ఔట్ చేసింది. ఆ కాసేపటికే ఓపెనర్ స్మృతి మంధానను ఎక్లెస్టోన్ ఔట్ చేసింది. దీంతో టీమిండియా 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 86 పరుగుల వద్ద పూజా వస్త్రాకర్ (6) కూడా ఔట్ అయింది. అయితే చివర్లో సీనియర్ పేసర్ ఘులన్ గోస్వామి బ్యాట్ ఘులిపించడంతో టీమిండియా స్కోర్ 100 పరుగులు దాటింది. అయితే జట్టు స్కోర్ 123 పరుగుల వద్ద ఉండగా రిచా గోష్ (33) రనౌట్ కావడం, ఆ కాసేపటికే గోస్వామి (20) కూడా ఔటవడంతో 129 పరుగులకు టీమిండియా 9 వికెట్లు కోల్పోయింది. చివరగా మేఘనా సింగ్ (3)ను షార్లెట్ డీన్ చేయడంతో 134 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో షార్లెట్ డీన్ 4, అన్య ష్రూబ్సోల్ 2, కేట్ క్రాస్, ఎక్లెస్టోన్ తలో వికెట్ తీశారు.