
చెలరేగిన అమీ సాటర్త్‌వైట్
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళలు అమీ సాటర్త్‌వైట్ చెలరేగడంతో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అమీ సాటర్త్‌వైట్ 84 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేసింది. ఆమెకు హాఫ్ సెంచరీతో ఆమేలి కేర్ కూడా సహకరికంచింది. మిగతా బ్యాటర్లలో వికెట్ కీపర్ కేటీ మార్టిన్ 41, కెప్టెన్ డివైన్ 35, మ్యాడీ గ్రీన్ 27, మాకే 13 పరుగులు చేశారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. మిగతా బౌలర్లలో గైక్వాడ్ 2, దీప్తిశర్మ, గోస్వామి తలో వికెట్ తీశారు.

టాప్ 3 విఫలం
అనంతరం 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 19.1 ఓవర్లలో 50 పరుగులు మాత్రమే చేసి టీమిండియా టాప్ 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు యాస్తిక భాటియా (28), స్మృతి మంధాన (6)తోపాటు దీప్తి శర్మ (5) నిరాశపరిచారు.
ఈ క్రమంలో కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ నాల్గో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 97 పరుగుల వద్ద ఉండగా 31 పరుగులు చేసిన మిథాలీ రాజ్ ఔటయ్యింది. ఆ వెంటనే రిచా ఘోష్ డకౌట్ అయింది. దీంతో 29.5 ఓవర్లలో టీమిండియా 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీనికి తోడు సాధించాల్సిన రన్‌రేట్ కూడా భారీగా పరిగింది.

హర్మన్ ప్రీత్ కౌర్ పోరాటం
ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. స్నేహ్ రానాతో కలిసి 30 పరుగులు, పూజా వస్త్రాకర్‌తో కలిసి 16 పరుగులు జోడించింది. అయితే జట్టు స్కోర్ 178 పరుగుల వద్ద ఉండగా 6 ఫోర్లు, 2 సిక్సులతో 63 బంతుల్లోనే 71 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ అమేలి కేర్ బౌలింగ్ ఔటైంది. దీంతో 44 ఓవర్లలో 178 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి టీమిండియా ఓటమికి చేరువైంది.
కాసేపటికే మిగతా రెండు వికెట్లు కోల్పోయి 46.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటై భారత మహిళలు ఓటమి మూటగట్టుకున్నారు. కివీస్ బౌలర్లలో అమేలి కేర్, లీ తహుహు మూడేసి వికెట్లు తీసింది. హేలీ జెన్సన్ 2, జేస్ కేర్, హన్నా రోవ్ తలో వికెట్ తీసింది. కాగా మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో ఓడింది.


Click it and Unblock the Notifications
