Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens World Cup 2022: బౌల‌ర్లు పోరాడినా భార‌త్‌కు ప‌రాజ‌యం.. ఇంగ్లండ్‌ను గెలిపించిన హీథర్

Womens World Cup 2022: England Women won by 4 Wickets Beat Indian Women

మాంట్ మాంగ‌నూయ్‌: ఉమెన్స్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియాకు మ‌రో ప‌రాజయం ఎదురైంది. ఇంగ్లండ్ ఉమెన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త ఉమెన్స్ జ‌ట్టు 4 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. బ్యాట‌ర్లంతా విఫ‌ల‌మ‌వ‌డంతో భారీ స్కోర్ చేయ‌లేక‌పోయినా టీమిండియాను బౌల‌ర్లు గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది.

ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ చివ‌రి వ‌ర‌కు ఆడి ఆ జ‌ట్టును గెలిపించింది. ఈ టోర్నీలో భార‌త ఉమెన్స్‌కు ఇది రెండో ప‌రాజ‌యం కాగా, ఇంగ్లండ్ ఉమెన్స్‌కు ఇదే తొలి విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. 4 కీల‌క వికెట్ల‌తో భార‌త్‌ను దెబ్బ‌కొట్టిన షార్లెట్ డీన్‌కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

దెబ్బ‌కొట్టిన గోస్వామి, మేఘ‌న‌

దెబ్బ‌కొట్టిన గోస్వామి, మేఘ‌న‌

135 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ ఉమెన్స్ టీంను ఆరంభంలోనే ఘుల‌న్ గోస్వామి, మేఘ‌నా సింగ్ దెబ్బ కొట్టారు. దీంతో ఆ జ‌ట్టు 4 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలో 65 ప‌రుగుల హాఫ్ సెంచ‌రీ భాగ‌స్వామ్యంతో ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్, నటాలీ స్కివర్ జ‌ట్టును ఆదుకున్నారు. 45 ప‌రుగులు చేసిన న‌టాలీ స్కివ‌ర్‌ను ఔట్ చేసి ఈ భాగ‌స్వామ్యాన్ని పూజా వ‌స్త్రాక‌ర్ విడ‌దీసింది. ఆ త‌ర్వాత ఇంగ్లండ్ స్కోర్ 102 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 10 ప‌రుగులు చేసిన వికెట్ కీప‌ర్ అమీ ఎలెన్ జోన్స్‌ను గైక్వాడ్ నాల్గో వికెట్‌గా ఔట్ చేసింది.

ఇంగ్లండ్ విజ‌యం

ఇంగ్లండ్ విజ‌యం

జ‌ట్టు స్కోర్ 128 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా మేఘ‌నా సింగ్ మ‌రోసారి చెల‌రేగింది. సోఫియా డంక్లీ (17), కేథరిన్ బ్రంట్ (0)ను ఒకే ఓవ‌ర్లో ఫెమిలియ‌న్ పంపింది. దీంతో ఇంగ్లండ్ 128 ప‌రుగుల‌కు 6 వికెట్లు కోల్పోయింది. అయితే హాఫ్ సెంచ‌రీ చేసిన కెప్టెన్ హీథర్ నైట్ (53*), సోఫీ ఎక్లెస్టోన్‌తో కలిసి మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డి ఇంగ్లండ్‌ను విజ‌య తీరాల‌కు చేర్చింది. భార‌త బౌల‌ర్ల‌లో మేఘ‌నా సింగ్ 3, రాజేశ్వ‌రి గైక్వాడ్, పూజా వ‌స్త్రాక‌ర్, ఝుల‌న్ గోస్వామి త‌లో వికెట్ తీశారు.

బ్యాట‌ర్లు విఫ‌లం

బ్యాట‌ర్లు విఫ‌లం

అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన‌ టీమిండియా ఉమెన్స్ టీం బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. బ్యాటింగ్ ఆర్డ‌ర్ మొత్తం మూకుమ్మడిగా విఫ‌ల‌మ‌వడంతో భార‌త జ‌ట్టు 134 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. మొత్తం జ‌ట్టులో న‌లుగురు బ్యాట‌ర్లు మాత్ర‌మే రెండెంకెల స్కోర్ చేశారు. మిగతా వారంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

ఇంగ్లీష్ బౌల‌ర్ల‌లో షార్లెట్ డీన్ 4 వికెట్ల‌తో భార‌త్‌ ప‌త‌నాన్ని శాసించింది. భార‌త్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ స్మృతి మంధాన 35 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. మిగ‌తా వారిలో రిచా ఘోష్ 33, ఘుల‌న్ గోస్వామి 20, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 14, యాస్తిక భాటియా 8, పూజా వ‌స్త్రాక‌ర్ 6, మేఘ‌నా సింగ్ 3, మిథాలీ రాజ్ 1, గైక్వాడ్ 1* ప‌రుగులు చేశారు. దీప్తి శ‌ర్మ‌, స్నేహ్ రానా డ‌కౌట్ అయ్యారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో షార్లెట్ డీన్ 4, అన్య ష్రూబ్సోల్ 2, కేట్ క్రాస్, ఎక్లెస్టోన్ తలో వికెట్ తీశారు.

Story first published: Wednesday, March 16, 2022, 12:14 [IST]
Other articles published on Mar 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+