Womens World Cup: చివరి ఓవర్లో డాటిన్ మ్యాజిక్.. 3 వికెట్లు డౌన్.. కివీస్‌పై విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ

మౌంట్ మౌన్‌గనుయ్: ఉమెన్స్ వరల్డ్‌కప్ ఫస్ట్ మ్యాచే అభిమానులకు సూపర్ థ్రిల్ ఇచ్చింది. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 6 పరుగులు కావాల్సి ఉండగా విండీస్ మహిళా బౌలర్ డియాండ్రా డాటిన్ మ్యాజిక్ చేసింది. 2 వికెట్లతోపాటు ఓ రనౌట్‌తో మూడు వికెట్లను ఖాతాలో వేసుకుని 2 పరుగులే ఇచ్చి జట్టును గెలిపించింది. దీంతో విజయం ఖాయమనుకున్న ప్రపంచకప్‌నకు అతిథ్యం ఇస్తున్న న్యూజిలాండ్ మహిళలకు బిగ్ షాక్ తగిలింది.
హేలీ మాథ్యూస్ సెంచరీ
ఓపెనర్ హేలీ మాథ్యూస్ సెంచరీ సాధించడంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ 128 బంతుల్లో 119 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో చెడియన్ నేషన్ 36, కెప్టెన్ టేలర్ 30, వికెట్ కీపర్ కాంప్బెల్లే 20, డియాండ్రా డాటిన్ 12 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో తాహుహు 3, జెస్ కెర్ 2, హన్నా రోవ్, అమేలియా కెర్ తలో వికెట్ తీశారు.
సోఫీ డివైన్ సెంచరీ
అనంతరం 260 పరుగుల లక్ష్యంతో న్యూజిలాండ్ మహిళలు బరిలోకి దిగగా ఆ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ సెంచరీతో చెలరేగింది. మొత్తంగా 127 బంతులు ఎదుర్కొన్న సోఫీ డివైన్ 10 ఫోర్ల సాయంతో 108 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కేటీ మార్టిన్ (44), అమీ సాటర్త్‌వైట్ (31), జెస్ కెర్ (25) కూడా మంచి స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ విజయం ఖాయంగా కనిపించింది. 49 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 254-7గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే మరో 6 పరుగులు కావాలి. క్రీజులో కేటీ మార్టిన్ (44), జెస్ కెర్ (25) ఉన్నారు.
డియాండ్రా డాటిన్ మ్యాజిక్
ఈ సమయంలో చివరి ఓవర్‌ను డియాండ్రా డాటిన్ వేసింది. ఈ మ్యాచ్‌లో ఆమె వేసిన ఏకైక ఓవర్ ఇదే కావడం గమనార్హం. ఈ ఓవర్‌లో తొలి బంతికి ఒక పరుగు ఇచ్చిన డాటిన్ రెండో బంతికి 44 పరుగులు చేసిన కేటీ మార్టిన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసింది. మూడో బంతికి ఒక్క పరుగు రాగా నాల్గో బంతికి 25 పరుగులు చేసిన జెస్ కెర్‌ను ఔట్ చేసింది. ఆమె హెన్రీకి క్యాచ్ ఇచ్చి ఔటయింది. ఐదో బంతికి ఫ్రాన్ జోనాస్‌ను డాటిన్ రనౌట్ చేసింది. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఆలౌటైంది. 3 పరుగుల తేడాతో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. డాటిన్ వేసిన ఈ ఓవర్‌లో మ్యాజిక్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఓవర్‌లో రెండు పరుగులు రాగా 3 వికెట్లు పడిపోయాయి. సెంచరీతో చెలరేగిన హేలీ మాథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునకు ఎంపికైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications