మహిళల టీ20 ప్రపంచకప్-2024లో ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సెమీస్ చేరుకోవడానికి కావాల్సిన అర్హత పాయింట్లు (6) సాధించినప్పటికీ, మెరుగైన నెట్‌రన్‌రేటు లేకపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
మరోవైపు ఇంగ్లండ్‌పై గొప్ప విజయం సాధించిన వెస్టిండీస్ టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీస్‌కు చేరింది. గ్రూప్-బీ నుంచి విండీస్‌తో పాటు దక్షిణాఫ్రికా కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 141 పరుగులు చేసింది. నాట్ సీవర్ (57 నాటౌట్; 50 బంతుల్లో, 5 ఫోర్లు), హెదర్ నైట్( 21; 13 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్లు. వెస్టిండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ మూడు వికెట్లు, హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (50; 38 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), (కియానా జోసెఫ్ 52, 38 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డాటిన్ (27; 19 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. ఇంగ్లండ్ బౌలర్లలో సారా గ్లెన్, సోఫీ ఎకిల్‌స్టోన్, నాట్ సీవర్ తలో వికెట్ తీశారు. క్యాచ్‌లను జారవిడవడం ఇంగ్లండ్‌కు ప్రతికూలంగా మారింది. జోసెఫ్‌కు ఏకంగా నాలుగు సార్లు లైఫ్ లభించింది.
కాగా, సెమీఫైనల్-1లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. దుబాయ్ వేదికగా గురువారం రాత్రి 7.30 ఈ మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్-2లో వెస్టిండీస్‌తో న్యూజిలాండ్ పోటీపడనుంది. షార్జా వేదికగా శుక్రవారం రాత్రి 7.30 ఈ పోరు ప్రారంభం కానుంది. సెమీస్‌లో గెలిచిన జట్లు ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్‌లో తలపడతాయి.