Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు సెమీస్ గండం.. ఒక్క ఓటమితో అంతా తలకిందులైంది!

T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన పరాజయం భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చేసింది. టోర్నీలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లపై వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా.. బలమైన దక్షిణాఫ్రికా చేతిలో బోల్తా పడింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ప్రతి గ్రూప్ నుంచి కేవలం రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్స్ దశకు అర్హత సాధిస్తాయి. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం ఒక్క ఓటమి కూడా టోర్నీలో జట్టు భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉండటంతో భారత్ తదుపరి రౌండ్‌కు వెళ్లడంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

గ్రూప్-1 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా జట్టు ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ పరంగా దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలో ఉండగా.. పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

Womens T20 World Cup 2026 Semi-Final Scenarios for Team India After South Africa Loss Details

భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌లను బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో ఆడాల్సి ఉంది. ఒకవేళ బలమైన ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం పాలైతే.. గరిష్టంగా 6 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్‌లను బలహీనమైన బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా జట్టు గెలిస్తే 8 పాయింట్లతో ఈజీగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. దీనివల్ల భారత్ గ్రూప్ దశ నుంచే ఇంటిబాట పట్టే ప్రమాదం ఉంది. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్, భారత్ చేతిలో ఓడిపోతే సమీకరణాలు మళ్లీ మారే అవకాశం ఉంది.

ఇక భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థికి 159 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్ మారిజాన్ కాప్ 81 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో తన జట్టుకు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ రాధా యాదవ్.. మారిజాన్ కాప్ 27, 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేయడం టీమిండియా పరాజయానికి ప్రధాన కారణమైంది.

Story first published: Monday, June 22, 2026, 9:44 [IST]
Other articles published on Jun 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+