Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

Womens T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్ -2026 షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్-వేల్స్ వేదికగా వచ్చే ఏడాది(2026) జూన్ 12 నుంచి మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఐసీసీ ఈ మేరకు బుధవారం ప్రకటనను విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో 12 జట్లు భాగం కానున్నాయి. భారత్. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో పాటు గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో 4 జట్లు వరల్డ్ కప్‌నకు అర్హత సాధించనున్నాయి.

ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బీలో తలో 6 జట్లు ఉండనున్నాయి. ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచ కప్ 2026 ఏడు వేదికల్లో 24 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్,లార్డ్స్ మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జూన్ 12న మొదలయ్యే మహిళల టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీ జులై 5న లార్డ్స్ మైదానంలో ఫైనల్ జరగనుంది.

Women s T20 World Cup 2026 Schedule Released India vs Pakistan on June 14

గ్రూప్-ఏ: భారత్. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, 2 క్వాలిఫయర్ టీమ్స్

గ్రూప్ బీ: వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, 2 క్వాలిఫయర్ టీమ్స్

భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అప్పుడే..
మహిళల టీ-20 ప్రపంచ కప్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. జూన్ 14న పాకిస్థాన్ జట్టుతో ఆ కీలక మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత గ్లోబల్ క్వాలిఫయర్స్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ 17న భారత్ తలపడనుంది. ఆ తర్వాత జూన్ 21న దక్షిణాఫ్రికా జట్టుతో, జూన్ 25 క్వాలిఫయర్ జట్టుతో, జూన్ 28న ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తేల్చుకోనుంది.

భారత జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూన్ 14న ఆడనుంది. ఆ తర్వాత భారత జట్టు షెడ్యూల్ ఇలా..
జూన్ 14: vs పాకిస్థాన్
జూన్ 17: vs గ్లోబల్ క్వాలిఫైయర్ 1
జూన్ 21: vs దక్షిణాఫ్రికా
జూన్ 25: vs గ్లోబల్ క్వాలిఫైయర్ 2
జూన్ 28: vs ఆస్ట్రేలియా

Story first published: Wednesday, June 18, 2025, 16:17 [IST]
Other articles published on Jun 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+