Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు బిగ్ షాక్.. స్ట్రెచర్‌పై వెళ్లిన స్టార్ స్పిన్నర్!

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో దూసుకుపోతున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ సందర్భంగా భారత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ స్టేడియంలో గాయపడింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆమె కుడి మడమ తిరగబడటంతో నడవలేని స్థితిలో స్ట్రెచర్ సహాయంతో స్టేడియాన్ని వీడాల్సి వచ్చింది. గాయం తీవ్రత ఎక్కువగా కనిపించడంతో ఆమె టోర్నీ మొత్తానికి దూరం కానుందా? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ తొలి బంతి వేసిన అనంతరం ఈ ఊహించని సంఘటన జరిగింది. బ్యాటర్ లెగ్ సైడ్ ఆడిన బంతిని అడ్డుకునేందుకు శ్రేయాంక పాటిల్ వేగంగా పరిగెత్తింది. అయితే బంతిని అందుకునే క్రమంలో ఆమె కుడి కాలుపై ల్యాండ్ అవ్వడంతో మడమ గట్టిగా తిరిగింది. దాంతో ఆమె తీవ్రమైన నొప్పితో స్టేడియంలోనే కుప్పకూలిపోయింది. భారత ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. చివరికి కన్నీళ్లతో స్టేడియాన్ని వీడిన శ్రేయాంకను స్కానింగ్ కోసం తరలించినట్లు సమాచారం.

Womens T20 World Cup 2026 Big Blow for India as Shreyanka Patil Stretchered Off the Field Details

నిజానికి గాయాల కారణంగా శ్రేయాంక పాటిల్ గత కొంతకాలంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. ఇటీవల డబ్ల్యూపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లోకి అద్భుతంగా రీఎంట్రీ చేసి ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌లో రాణించాలని ఎంతో పట్టుదలగా బరిలోకి దిగింది. ఇంతలోనే మళ్లీ గాయపడటం శ్రేయాంక పాటిల్ కెరీర్‌తో పాటు భారత స్పిన్ విభాగానికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీచ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(74), షఫాలీ వర్మ(55) మొదటి వికెట్ కు 115 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు భారత బౌలర్లు 114 పరుగులకే ఆలౌట్ చేశారు. శ్రీ చరణి 4 వికెట్లతో, షఫాలీ వర్మ 3 వికెట్లతో చెలరేగడంతో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.

Story first published: Thursday, June 18, 2026, 10:52 [IST]
Other articles published on Jun 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+