మహిళల టీ20 వరల్డ్ కప్-2024 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం పది దేశాలు పోటీపడనున్నాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు దేశాలు ఉన్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, న్యూజిలాండ్, క్వాలిఫయిర్-1 టీమ్స్ ఉన్నాయి.
గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ 2 జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడతాయి. ఆయా గ్రూప్‌ల్లో నిలిచిన టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సిల్హెట్ వేదికగా అక్టోబర్ 17, ఢాకా వేదికగా అక్టోబర్ 18న సెమీస్ జరగనున్నాయి. ఢాకా వేదికగా అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్-సౌతాఫ్రికా తలపడనున్నాయి. భారత్ విషయానికొస్తే..అన్ని గ్రూప్ మ్యాచ్‌లు సిల్హెట్ వేదికగా ఆడనున్నాయి. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో, 9న క్వాలిఫయిర్-1 టీమ్‌తో, 13వ తేదీన ఆస్ట్రేలియాతో పోటీపడనున్నాయి.
టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2024 పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 3: ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా, ఢాకా
అక్టోబర్ 3: బంగ్లాదేశ్ vs క్వాలిఫయర్ 2, ఢాకా
అక్టోబర్ 4: ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 4: ఇండియా vs న్యూజిలాండ్, సిల్హెట్
అక్టోబర్ 5: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, ఢాకా
అక్టోబర్ 5: బంగ్లాదేశ్ vs ఇంగ్లండ్, ఢాకా
అక్టోబర్ 6: న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 6: భారత్ vs పాకిస్థాన్, సిల్హెట్
అక్టోబర్ 7 : వెస్టిండీస్ vs క్వాలిఫైయర్ 2, ఢాకా
అక్టోబర్ 8: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్, సిల్హెట్
అక్టోబర్ 9: బంగ్లాదేశ్ vs వెస్టిండీస్, ఢాకా
అక్టోబర్ 9 : ఇండియా vs క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 10: దక్షిణాఫ్రికా vs క్వాలిఫైయర్ 2, ఢాకా
అక్టోబర్ 11: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, సిల్హెట్
అక్టోబర్ 11: పాకిస్తాన్ vs క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 12: ఇంగ్లండ్ vs వెస్టిండీస్, ఢాకా
అక్టోబర్ 12: బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా, ఢాకా
అక్టోబర్ 13: పాకిస్థాన్ vs న్యూజిలాండ్, సిల్హెట్
అక్టోబర్ 13: భారత్ vs ఆస్ట్రేలియా, సిల్హెట్
అక్టోబర్ 14: ఇంగ్లాండ్ vs క్వాలిఫైయర్ 2, ఢాకా
అక్టోబర్ 17: సెమీ ఫైనల్-1, సిల్హెట్
అక్టోబర్ 18: సెమీ ఫైనల్-2, ఢాకా
అక్టోబర్ 20: ఫైనల్, ఢాకా