For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's T20WC: నేటి నుంచే పొట్టికప్.. జియో సినిమాలో రాదు- ఎలా చూడాలంటే?

క్రికెట్ అభిమానులను అలరించడానికి పొట్టి కప్ వచ్చేసింది. ఇవాళ నుంచి దుబాయ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. 18 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీలో 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన భారత్.. ఉమెన్స్ కప్‌ను సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగుతుంది. భారత మహిళల జట్టు ఇప్పటివరకు ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఈ సారైనా కప్ కలను సాకరం చేసుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది.

మెగాటోర్నీలో పోటీపడే పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌లోనూ ప్రతి జట్టూ మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశ ముగిసేసరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌-ఎలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ జట్లు ఉన్నాయి.

Women s T20 World Cup 2024 All You Need to Know - Schedule and Live Streaming

అక్కడి నుంచి ఇక్కడికి..

ఇప్పటివరకు ఎనిమిది మహిళల టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరింది. 2020లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్ వరకు చేరింది. ఈసారి కప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కాగా, ఆస్ట్రేలియా ఆరు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఈ మెగాటోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. భారత్‌లోని పిచ్‌లకు కాస్త సారూపత్య ఉన్న యూఏఈలో ఉండటం టీమిండియాకు అదనపు బలం చేకూర్చే అవకాశం ఉంది.

ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్, పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లు జరగనున్నాయి. రేపటి నుంచి భారత్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఉంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా అమీతుమి తేల్చుకోనుంది. అలాగే అక్టోబర్ 9న శ్రీలంక, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 17, 18న సెమీఫైనల్స్, అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది.

లైవ్ ఎలా చూడాలంటే?
మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అలాగే డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లోనూ లైవ్ వస్తుంది.

మహిళల టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్), షెఫాలి వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, హేమలత, ఆశ శోభన, రాధా యాదవ్, శ్రేయాంక్ పాటిల్, సజన.

Story first published: Thursday, October 3, 2024, 7:55 [IST]
Other articles published on Oct 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+