For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళల టీ20 ఛాలెంజ్‌: ట్రయల్‌ బ్లేజర్స్‌పై వెలాసిటీ విజయం

Womens T20 Challenge 2019: Velocity lose five for zilch before clinching win

జైపూర్ వేదికగా ఐపీఎల్‌ మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా ట్రయల్‌ బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెలాసిటీకి శుభారంభం దక్కింది. ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ (5; 14 బంతుల్లో 1×4) నెమ్మదిగా ఆడినా.. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (34; 31 బంతుల్లో 5×4, 1×6) బ్యాట్ జులిపించింది. మాథ్యూస్‌ నిష్క్రమణ అనంతరం షెఫాలీతో కలిసి డేనియెల్‌ వ్యాట్‌ (46; 35 బంతుల్లో 5×4, 2×6) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపింది.

ఆ తర్వాత కెప్టెన్ మిథాలీ రాజ్‌ (17; 22 బంతుల్లో 1×4) కూడా పర్వాలేదనిపించింది. అయితే జట్టు స్కోరు 111 వద్ద.. 7 బంతుల వ్యవధిలో వ్యాట్‌, వేద కృష్ణమూర్తి, మిథాలీ రాజ్, శిఖ పాండే, అమెలియా కెర్ పెవిలియన్ బాట పట్టడంతో మ్యాచ్‌ ఉత్కంఠ రేపింది. 18వ ఓవర్ చివరి బంతికి సుశ్రీ ప్రధాన్‌ 2 పరుగులు తీసి విజయాన్ని అందించింది. దీప్తిశర్మ నాలుగు వికెట్లు తీసింది.

Womens T20 Challenge 2019: Velocity lose five for zilch before clinching win

తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రయల్‌ బ్లేజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. స్మృతి మంధాన (10) నిరాశ పరిచినా.. హర్లీన్‌ డియోల్‌ (43), సుజీబేట్స్‌ (26) ఆదుకున్నారు. మధ్య ఓవర్లలో దీప్తి శర్మ (16) పోరాడింది. ఏక్తా బిష్ఠ్‌, అమెలియా కెర్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

Story first published: Wednesday, May 8, 2019, 19:40 [IST]
Other articles published on May 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+