టీ20 ఛాలెంజ్: సూపర్‌నోవాస్‌పై ట్రయల్ బ్లేజర్స్ విజయం

జైపూర్ వేదికగా జరిగిన మహిళల టీ20 ఛాలెంజ్‌లోని తొలి మ్యాచే అభిమానులను ఆకట్టుకుంది. పురుషుల ఐపీఎల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపింది. ఇన్నింగ్స్ చివరి బంతికి బ్యాట్స్‌మన్ రనౌట్ కావడంతో.. సూపర్‌నోవాస్‌పై ట్రయల్ బ్లేజర్స్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆదిలోనే ఎదురుదెబ్బ:
141 పరుగుల లక్ష్యంతో బరిలోకిదిగిన సూపర్‌నోవాస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియా పూనియా (2) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరింది. తర్వాత చమరీ ఆటపట్టు (26; 34 బంతుల్లో 2×4), జెమీ రోడ్రిగ్స్ (24; 19 బంతుల్లో 4×4) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాక జెమిమా రనౌట్ అయింది. ఆ వెంటనే ఆటపట్టు కూడా నిష్క్రమించింది.

హర్మన్ ప్రీత్ మెరుపులు:
అనంతరం సోఫీ డివైన్ (32; 22 బంతుల్లో 2×4, 2×6) సహకారంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ (46*; 34 బంతుల్లో 8×4) బ్యాట్ జులిపించింది. ఈ జోడి పరుగులు చేయడంతో సూపర్‌నోవాస్ విజయం వైపు దూసుకెళ్లింది. ఈ దశలో సోఫీ పెవిలియన్ చేరింది. చివరి ఓవర్‌లో సూపర్ నోవాస్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. హర్మన్ 4, 4, 0, 4, 4 బౌండరీల మోత మోగించింది. ఇక చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. జులన్ ఆఫ్‌సైడ్ బంతిని విసరడంతో పరుగు రాలేదు. పరుగు కోసం ప్రయత్నించిన తహూహూ రనౌటైంది. ట్రయల్ బ్లేజర్స్ విజయం ఖరారు అయింది.

మంధాన ఒంటరి పోరాటం:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సుజి బేట్స్ (1) త్వరగానే పెవిలియన్ చేరినా.. కెప్టెన్ స్మృతి మంధాన (67 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకుంది. మంధానకు హర్లీన్ డియోల్ (44 బంతుల్లో 36; 3 ఫోర్లు) సహకారం అందించింది. డియోల్ నిష్క్రమణ అనంతరం మరెవ్వరు క్రిజులో నిలవకపోవడంతో మంధాన ఒంటరి పోరాటం చేసింది. మంధానకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications