Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia cup: పసికూనపై విధ్వంసం.. సెమీస్‌లో పాకిస్థాన్!

దంబుల్లా వేదికగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఉమెన్స్ టీమ్ విజృంభించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి పది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. ఈ విజయంతో నెట్‌రన్‌రేటును భారీగా మెరుగు పర్చుకున్న
పాకిస్థాన్ మహిళల ఆసియాకప్ సెమీఫైనల్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. భారత్‌పై నేపాల్ భారీ విజయం సాధిస్తే మినహా పాక్ సెమీస్‌కు చేరడం ఖాయమే.

సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్‌ను నేపాల్ ఓడించడం దాదాపు అసాధ్యం. దీంతో పాక్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన పసికూన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 103 పరుగులు చేసింది. తీర్థా (40; 36 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. పాక్ బౌలర్లలో సదియా, నష్రా, టుబా తలో రెండు వికెట్లతో మెరిశారు.

Women s Asia Cup 2024 Pakistan s Semi-Final Hopes Soar with Win Over UAE

అయితే ఓపెనర్లు ఇషా, తీర్థా పవర్‌ప్లే వరకు క్రీజులోనే ఉన్నారు. కానీ జాగ్రత్తగా ఆడటంతో స్కోరుబోర్డు నెమ్మదిగా సాగింది. పవర్‌ప్లేలో యూఏఈ 24 పరుగులే చేసింది. అనంతరం మిడిల్ ఓవర్లలో యూఏఈ బ్యాటింగ్‌లో దూకుడు పెంచి ఆరు ఎకానమీ రేటుతో పరుగులు చేసింది. కానీ క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఇక డెత్ ఓవర్లలో పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 25 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు.

అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 14.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయాన్ని సాధించింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా (62 నాటౌట్; 55 బంతుల్లో, 8 ఫోర్లు), మునీబా అలీ (37 నాటౌట్; 30 బంతుల్లో, 4 ఫోర్లు) సత్తాచాటారు. పవర్‌ప్లేలో వీరిద్దరు ఏడు ఎకానమీ రేటుతో 42 పరుగులు చేసింది. ఆ తర్వాత మరింత దూకుడు పెంచి జట్టుకు విజయాన్ని అందించారు. భారత్ చేతిలో ఓటమిపాలైన పాకిస్థాన్ గ్రూప్-ఏలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి నాలుగు పాయింట్లు సాధించింది. సెమీస్‌లో శ్రీలంకతో పాక్ తలపడే అవకాశం ఉంది.

Story first published: Tuesday, July 23, 2024, 18:17 [IST]
Other articles published on Jul 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+