Womens Asia Cup 2022: ఆసియాకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు ఇదే..! టీమిండియా షెడ్యూల్, తదితర వివరాలు

మహిళల ఆసియా కప్ - 2022 టీ20 టోర్నీ వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా భారత వుమెన్స్ టీం బరిలోకి దిగబోతుంది. మొన్న జరిగిన ఆసియాకప్ మెన్స్ టోర్నీలో ఇండియా సూపర్ 4దశలోనే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి వుమెన్స్ టీం ఆసియాకప్ టైటిల్ నెగ్గి ఆసియాకప్ లోటును భర్తీ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత్ వుమెన్స్ వర్సెస్ పాకిస్థాన్ వుమెన్స్ జట్ల మధ్య అక్టోబర్ 7న మ్యాచ్ జరగబోతుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా మంగళవారం ప్రకటించారు.
ఎప్పటి నుంచి ఎప్పటివరకు
అక్టోబరు 1నుంచి ఆసియాకప్ వుమెన్స్ టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 1నుంచి 15వరకు 15రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో ఏడు జట్లు పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ప్రతి జట్టు మరో జట్టుతో ఒక్క మ్యాచ్ ఆడుతుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్లో అక్టోబర్ 15న తలపడతాయి.
తాలిబన్ల వల్ల ఆ టీం మిస్
ఆసియాకప్ వుమెన్స్ టోర్నీలో పాల్గొనే ఏడు జట్లు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ, థాయిలాండ్, మలేషియా. బంగ్లాదేశ్ జట్టు హోం టీంగా బరిలోకి దిగబోతుంది. ఇకపోతే ఈ మార్క్యూ ఈవెంట్‌కు ఆఫ్ఘనిస్థాన్ టీం మిస్సయింది. గతేడాది ఆగస్టులో తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడంతో ఆఫ్ఘన్లో క్రీడల్లో మహిళల పార్టిసిపేషన్ పూర్తిగా తగ్గిపోయింది. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో వుమెన్స్ క్రికెట్ టీం ఆడడం ఆపేసింది. దీంతో ఆఫ్ఘన్ మెన్స్ టీం మాత్రమే క్రికెట్ ప్రస్తుతం ఆడుతోంది.

భారత్ షెడ్యూల్ ఇదే
ఇకపోతే ఈ టోర్నీలో తొలిరోజు అక్టోబర్ 1న శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఆసియాకప్ వుమెన్స్ టోర్నీలో చెప్పుకోదగ్గ టీంలో శ్రీలంక కూడా ఒకటి. ఇక భారత్ అక్టోబర్ 3న మలేషియాతో, అక్టోబర్ 4న యూఏఈతో, అక్టోబర్ 7న పాకిస్తాన్‌తో అక్టోబర్ 8న ఆతిథ్య బంగ్లాదేశ్‌తో, అక్టోబరు 10న థాయిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు టాప్ 4లో ఉండడం ఖాయం కాబట్టి.. అక్టోబర్ 11 లేదా 13న జరిగే సెమీఫైనల్స్‌లో భారత్ మరో జట్టును ఎదుర్కొంటుంది. సెమీఫైనల్లో గెలిస్తే అక్టోబర్ 15న ఫైనల్ ఆడనుంది. ఇకపోతే ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఆసియాకప్ టోర్నీకి భారత వుమెన్స్ టీం
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘనా సింగ్, రేణుక వస్త్రాకర్, రాజేశ్వరి గయాక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవగిరే
స్టాండ్‌బై ప్లేయర్లు: తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications