
ఐర్లాండ్‌పై విజయం సాధిస్తే సెమీస్ బెర్తు ఖాయం
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఐర్లాండ్‌పై విజయం సాధించి వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ క్రీడల్లో లింగ సమానత్వాన్ని ప్రమోట్ చేశాడు.
భారత మహిళల జట్టుకు కోహ్లీ విషెస్
"కలర్ జెర్సీలు ధరించి బయట మనసుపెట్టి ఆడుతోన్న మన మహిళల జట్టుని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. దేశం తరుపున ప్రాతినిథ్యం వహిస్తూ, జెర్సీని ధరిండం ఓ గొప్ప మూమెంట్. మీరు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు, మీ జెండర్ ఏదనేది ఈ జెర్సీ లెక్కచేయదు. మీ చేతిని పట్టుకుని వెస్టిండిస్‌లోని భారత జట్టుకి సపోర్ట్ చేయండి" అని కోహ్లీ తన వీడియో ట్వీట్‌లో పేర్కొన్నాడు.

రిషబ్ పంత్‌ను నామినేట్ చేసిన కోహ్లీ
అదే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇందుకు తన సహచర క్రికెటర్ రిషబ్ పంత్, భారత పుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను నామినేట్ చేశాడు. కాగా, కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది.

4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోన్న భారత్
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీతో చెలరేగగా... పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ సాధించింది. మరోవైపు రెండు మ్యాచ్‌ల్లో ఓటములు ఎదుర్కొన్న ఐర్లాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో కనీసం పోటీనివ్వాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రూపు-బిలో ఆస్ట్రేలియా 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే భారత్ 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications












