Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షాక్: వరల్డ్‌కప్ నుంచి మిథాలీ సేన జట్టు నిష్క్రమణ

ధర్మశాల: ఐసీసీ వరల్డ్ టీ20లో భారత మహిళల జట్టుకు పెద్ద షాక్ తగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. దీంతో టీ20 వరల్డ్ కప్ నుంచి భారత మహిళల జట్టు నిష్క్రమించింది.

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత మహిళలు జట్టుపై ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు తడబడ్డారు. సెమీస్‌ ఆశలు పదిలంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన మిథాలీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి ఇంగ్లాండ్‌కు 91 పరుగుల చేసింది. దీంతో ఇంగ్లాండ్ విజయ లక్ష్యాన్ని 91 పరుగులుగా నిర్దేశించింది.

Women's WT20: England beat India by 2 wickets in a low-scoring thriller

ఓపెనర్లు వనిత (0), స్మృతి మందన (12) మరోసారి నిరాశ పరచగా.. కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (21), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (26), అనూజ (10) ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో హేథర్‌నైట్‌ (3), అన్య (2), నటాలీ (1) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు.

అనంతరం బ్యాటింగ్‌కు ఇంగ్లాండ్ జట్టు ఆరు బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ బీమౌంట్ (20), టేలర్ (16), స్కీవర్ (19) పరుగులతో రాణించారు.

భారత బౌలర్లు బిస్త్ నాలుగు, కౌర్ రెండు వికెట్లు తీసుకున్నారు. ఇప్పటివరకూ భారత మహిళల జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింట ఓటమి చెందారు. అంతకుముందు పాకిస్తాన్ పై కూడా భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్: షార్లెట్ ఎడ్వర్డ్స్ (సి), టామీ బోమోంట్, కేథరీన్ బ్రంట్, లిడియా గ్రీన్వే, రెబెక్కా, జెన్నీ గన్, హీథర్ నైట్, నటాలీ, సారా టేలర్ (WK), డేనియల్ వ్యాట్

ఇండియా: వల్లస్వామి వనితా, స్మ్రుతి మందడ, మిథాలీ రాజ్ (సి), హర్మన్ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, అనుజ పాటిల్, ఝులన్ గోస్వామి, శిఖా పాండే, సుష్మా వర్మ (WK), ఏక్తా బిస్త్, రాజేశ్వరీ గైక్వాడ్

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+