వాట్ ఏ విక్టరీ: పాక్‌పై మిథాలీ సేన విజయం, ప్రశంసల వెల్లువ
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. టోర్నీలో భాగంగా జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో భారత విజయంలో బ్యాట్స్‌ఉమన్ కీలకపాత్ర పోషిస్తే ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లే గెలిపించారు.
టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప స్కోరును కాపాడుకునే ప్రయత్నంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిస్త్ (10-2-18-5) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
తొలుత బ్యాటింగ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (72 బంతుల్లో 47; 5 ఫోర్లు), సుష్మ వర్మ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 38.1 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది.
పాక్ కెప్టెన్ సనా మీర్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి పాకిస్థాన్ పతనాన్ని శాసించింది. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై విజయం సాధించడంతో పలువురు అభిమానులు సోషల్‌మీడియా ద్వారా మిథాలీ సేనకు అభినందనలు తెలిపారు.
హర్భజన్ సింగ్
'ప్రపంచకప్‌లో వరుసగా మూడో విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు' అని హర్భజన్ సింగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
కపిల్ దేవ్
వాట్ ఏ విక్టరీ. భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది' అని కపిల్ దేవ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
సంజయ్ మంజ్రేకర్
‘కీలక బ్యాట్స్‌వుమెన్లు విఫలమైన వేళ.. ఏక్తా బిస్త్‌తో పాటు బౌలర్లు రాణించడంతో భారత్ విజయం దక్కించుకుంది. వెల్‌డన్ ఇండియా' అని సంజయ్ మంజ్రేకర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
మిథాలీ రాజ్
'పాక్‌పై ఆడిన 10మ్యాచుల్లో పదింటినీ మనమే నెగ్గాం. ఈ ఆదివారం ప్రత్యేకత ఇది. ఏక్తా అద్భుత ప్రదర్శన కనబరిచింది' అని మిథాలీ రాజ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
వీరేంద్ర సెహ్వాగ్
‘పాక్‌పై విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. హ్యాట్సాఫ్. జట్టంతా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది' అని వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
స్మృతి మందాన
'ఏక్తా బిస్త్ అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీలో ఆడిన మూడింట్లో మూడూ నెగ్గాం. ఇప్పుడు తదుపరి మ్యాచ్‌పైనే మా దృష్టంతా' అని స్మృతి మందాన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
రోహిత్ శర్మ
‘వావ్. మన మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీ మొత్తం ఇదే విధంగా దూసుకెళ్లండి' అని రోహిత్ శర్మ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications