ప్రపంచకప్ షెడ్యూల్ ఫిక్స్.. ఆరంభంలోనే భారత్, పాకిస్థాన్ ఢీ

ఐసీసీ మహిళల ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. ఐసీసీ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ ప్రపంచకప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. నిజానికి న్యూజిలాండ్ అతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచకప్ ఈ ఏడాదిలోనే జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ వాయిదా విషయాన్ని గత ఏడాది డిసెంబర్ 15న ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాగా పాత షెడ్యూల్ ప్రకారం 2021 ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు వరల్డ్‌కప్ జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

కొత్త షెడ్యూల్ విడుదల
నూతన షెడ్యూల్ ప్రకారం 2022 మార్చి 4న ప్రారంభం కానున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఏప్రిల్ 3న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. 31 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనున్న ఈ ప్రపంచకప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ ట్రోఫీ కోసం అమితుమీ తేల్చుకోనున్నాయి. 2017 నుంచి 2020 మధ్య జరిగిన ఐసీసీ వన్డే క్రికెట్‌లోని ర్యాంకుల ఆధారంగా ఈ జట్లు ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి.

సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు అప్పుడే..
మార్చి 4న తౌరంగాలోని బే ఓవల్‌లో జరిగే ఆరంభ మ్యాచ్‌లో అతిథ్య న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడనుంది. లీగ్ స్టేజ్‌లో టాప్ 4 లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 30న వెల్లింగ్‌టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో మొదటి సెమీఫైనల్ జరగనుండగా, మార్చి 31న హాగ్లీ ఓవల్‌లో రెండో సెమీఫైనల్ జరగనుంది. ఏప్రిల్ 3న ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్‌డే కూడా ఉంది.

ఆరంభ మ్యాచ్‌లో పాక్‌తో భారత్ ఢీ
కాగా పురుషుల క్రికెట్ ప్రపంచకప్ మాదిరిగానే మహిళ ప్రపంచకప్‌లో కూడా భారత్ ఆరంభమ్యాచ్‌ను ఐసీసీ పాకిస్థాన్‌తో నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌లోనే భారత్, పాకిస్థాన్ తలపడనున్నయి. మార్చి 6న మౌంట్ మౌంగానుయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌ల విషయానికి వస్తే మార్చి 10న అతిథ్య న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, 16న ఇంగ్లండ్‌తో, 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, 27న సౌతాఫ్రికాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications