Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తిరుష్‌ కామిని సెంచరీ: 'సూపర్ సిక్స్' కు టీమిండియా

హైదరాబాద్: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌ టోర్నీలో భారత జట్టు హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌సిక్స్‌కు చేరింది. ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన గ్రూప్‌ 'ఎ' లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 250 పరుగులు చేసింది. ఓపెనర్‌ తిరుష్‌ కామిని (146 బంతుల్లో 113 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సులతో ) సెంచరీ చేయగా, మరో ఓపెనర్ దీప్తి శర్మ (128 బంతుల్లో 89; 10 ఫోర్లు, ఒక సిక్స్‌)తో రాణించారు.

Women's World Cup Qualifier: Thirush Kamini's ton takes India to Super Six

వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో పూనమ్‌ 3, శిఖా పాండే 2, ఏక్తా బిష్త్‌ 2, దేవిక వైద్య 2 వికెట్లు తీసుకున్నారు.

ఐర్లాండ్ జట్టులో లూయిస్‌ (33) టాప్‌ స్కోరర్‌‌గా నిలిచింది. సోమవారం జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో జింబాబ్వేతో భారత్‌ ఆడుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్‌ దశ ముగిశాక ఆయా గ్రూప్‌ల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ సిక్స్‌ దశకు చేరుతాయి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+