ఉమెన్ వరల్డ్ కప్: లంకపై భారత్ ఘన విజయం
హైదరాబాద్: మహిళల వన్డే వరల్డ్ కప్ సన్నాహాక మ్యాచ్‌లో బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది.
కెప్టెన్ మిథాలీ రాజ్ (85), పూనమ్ రౌత్ (69), మంధన (44) పరుగులతో రాణించారు. ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక 48.4 ఓవర్లలో 166 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో రాజేశ్వరి 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, శిఖా పాండే 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ మిథాలీ రాజ్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ని జూన్ 24వ తేదీన కంట్రీ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Women's WC: India win warm-up match
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications