న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళా ప్రపంచ కప్: పాక్ టప.. టప.., భారత్ దెబ్బకు ఇలా.. చిత్తు

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌, పాక్‌ క్రికెట్‌ సమరానికి సిద్ధమయ్యాయి. డెర్బీ కౌంటీ మైదానంలో మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన భారత జట్టు సారథి మిథాలీ రాజ్‌ బ్యాటింగ్‌ ఎంచుకొంది.

లండన్: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పైన భారత్‌ ఘన విజయం సాధించింది. ఏక్తా బిస్త్ ఐదు వికెట్లు తీసి 18 పరుగులే ఇచ్చింది. దీంతో భారత్ 95 పరుగుల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 38.1 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది.

ఓ దశలో 16 పరుగులకే పాక్ 4 వికెట్లు కోల్పోయింది. అప్పటికి తొమ్మిది ఓవర్లు పూర్తయ్యాయి. పాక్ బ్యాట్స్ వుమెన్ల్స్ ఆయేషా జఫర్, నహీదా ఖాన్, జవేరీ ఖాన్, సిద్రా నవాజ్‌.. ఇలా వరుస కట్టారు.

భారత్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాట్సు వుమెన్ స్కోర్.. 1, 23, 6, 0, 0, 5, 0, 29, 1, 0, 3.. గా నమోదయింది. వికెట్లు 1/1, 8/2, 9/3, 14/4, 24/5, 26/6, 44/7, 51/8, 51/9, 74/10 ఇలా పడ్డాయి.

 Womens World Cup: India won the toss and elected to bat first against Pakistan

భారత్ బ్యాటింగ్

- భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
- జట్టు స్కోర్ 107 పరుగుల వద్ద హర్మన్ ప్రీత్ కౌర్ అవుటయింది. ఆమె 10 పరుగులు చేసింది.
- నాలుగు వికెట్లు పడిపోయే సమయానికి భారత్ స్కోర్ 94.
- మిథాలీ రాజ్ అవుట్ కాగానే దీప్తి శర్మ కూడా నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరింది. ఆమె 28 పరుగులు చేసింది.
- జట్టు స్కోర్ 93 పరుగుల వద్ద మిథాలీ రాజ్ అవుటయింది. ఆమె 8 పరుగులకే అవుటయింది.
- జట్టు స్కోర్ 72 ఉన్నప్పుడు రెండో వికెట్ పడింది. పూనమ్ రౌత్ (47) అవుటయింది.
- భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మంచి ఫాంలో ఉన్న స్మృతి మందన.. బైగ్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయింది. ఇంగ్లాండుతో జరిగిన మ్యాచులో 90, విండీస్ మ్యాచులో సెంచరీతో స్మృతి అలరించింది. ఈ మ్యాచ్‌లో మాత్రం 2 పరుగులే చేసి, నిరాశపరిచింది.

Story first published: Monday, December 7, 2020, 9:44 [IST]
Other articles published on Dec 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X