హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మహిళల క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో మిథాలీ సేన తొలిసారిగా ఓడిపోయింది. లీసెస్టర్ వేదికగా శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ 115 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీలో వరుసగా నాలుగు విజయాలను నమోదు చేసిన మిథాలీ సేన తొలి ఓటమిని చవిచూసింది.

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 274 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో బరిలోకి దిగిన మిథాలీ సేన 158 పరుగులకే ఆలౌటైంది. పిజి రౌత్ 22, మంధన 4, డిబి శర్మ 60, మిథాలీ రాజ్ 0, ఎం కౌర్ 0, వి.కృష్ణమూర్తి 3, పాండే 0, వర్మ 1, బిష్త్ 13 పరుగులు చేసి అవుటయ్యారు. ఝలన్ గోస్వామి తుది వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
టీమిండియా విజయ లక్ష్యం 274
అంతకముందు దక్షిణాఫ్రికా భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 274 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.

దక్షిణాఫ్రికా ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని అందించలేదు. ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. శిఖాపాండే బౌలింగ్‌లో ఓపెనర్ లౌరా వోల్వార్డ్‌ట్ (1) ఖా పాండే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చెట్టీతో కలిసి మరో ఓపెనర్ లిజెల్లా లీ (65 బంతుల్లో 92; 10 ఫోర్లు, 7 సిక్సుల)తో సెంచరీ మిస్ అయింది.
ఆమెను జట్టు స్కోరు 134 వద్ద హర్మన్ ప్రీత్ వికెట్ల ముందు క్యాచ్ పట్టింది. ఆ తర్వాత స్కోరు వేగం మందగించినా డానె వాన్ నికెర్క్ 66 బంతుల్లో 57 పరుగులతో కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడింది. 49 ఓవర్ వరకు ఆమె నిలవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది.
ఆ తర్వాత క్రీజులోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ విమెన్‌లలో త్రిషా చెట్టి 24, మిగ్నన్ డు ప్రీజ్ 22, మరిజానే కప్ 19, డేన్ కెప్టెన్ వాన్ నీకెర్క్ 57, చియో ట్రయన్ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శిఖా పాండే 3, ఏక్తా బిస్త్, హర్మన్ ప్రీత్ కౌర్ చెరో రెండు వికెట్లు తీయగా గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి మిథాలీ సేన ఫీల్డింగ్
ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో శనివారం భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. లీసెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
టోర్నీలో భాగంగా ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మిథాలీ సేన జోరు మీదుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టు సెమీఫైనల్ స్థానం దాదాపు ఖరారైనట్లే. మరోవైపు
టోర్నీలో ఇప్పటి వరకు రెండు విజయాలు మాత్రమే దక్షిణాఫ్రికా సాధించింది.

దీంతో టోర్నీలో తమ ఆశలు నిలబెట్టుకోవాలంటే భారత్‌పై తప్పక విజయం సాధించాల్సిందే. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 వన్డేలు జరగ్గా భారత్ 9 గెలిచి, 5 ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. దక్షిణాఫ్రికా గడ్డపైనే జరిగిన గత మూడు వన్డేల్లో భారత్ రెండింటిలో గెలవడం విశేషం.
జట్ల వివరాలు:
ఇండియా:
Smriti Mandhana, Poonam Raut, Deepti Sharma, Mithali Raj, Harmanpreet Kaur, Veda Krishnamurthy, Shikha Pandey, Jhulan Goswami, Sushma Verma, Ekta Bisht, Poonam Yadav.
దక్షిణాఫ్రికా:
Laura Wolvaardt, Lizelle Lee, Trisha Chetty, Mignon du Preez, Marizanne Kapp, Chloe Tryon, Dane van Niekerk, Sune Luus, Shabnim Ismail, Ayabonga Khaka, Moseline Daniels.