Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుమార్తె కల కోసం టీ కొట్టు నడిపిన తండ్రి: ఎవరీ ఏక్తా బిస్త్!

హైదరాబాద్: ఐసీసీ ఉమెన వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏక్తా బిస్త్ తన స్పిన్ మాయాజాలంతో భారత్‌కు సంచలన విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో ఏక్తా బిస్త్ రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిపోయింది. దీంతో ఎవరీ ఏక్తా బిస్త్ అని క్రికెట్ అభిమానులు ఆమె గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.

అయితే చాలా మందికి తెలియని విషయమేంటంటే ఏక్తా కలలను నెరవేర్చడం కోసం మాజీ సైనికోద్యోగి అయిన ఆమె తండ్రి ఛాయ్‌వాలాగా మారిపోయాడు. ఉత్తరాఖండ్‌లోని మారుమూల పల్లె ఆల్మోడా నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న తొలి క్రికెటర్‌గా బిస్త్‌ ఘనత సాధించింది.

ఆమె కుటుంబ సభ్యులెవరూ క్రికెటర్లు కాకపోయినప్పటికీ, అబ్బాయిలతో క్రికెట్‌ ఆడుతూ క్రమక్రమంగా క్రికెట్‌లో ఎదిగింది. క్రికెట్‌లో ఏక్తా ఎదిగేందుకు ఆమె కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఏక్తా తండ్రి కుందన్ సింగ్ బిస్త్ భారత ఆర్మీ నుంచి 1988లో రిటైరయ్యాక వచ్చే పెన్షన్‌ రూ.1500 సరిపోకపోవడంతో తన కుటుంబం కోసం టీ కొట్టు పెట్టాడు.

ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడిన ఏక్తా బిస్త్

ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడిన ఏక్తా బిస్త్

కుందన్‌కు ఏక్తాతో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఆయన ఈ టీ కొట్టుని నడిపేవాడు. 'ఆరేళ్ల వయసులో ఏక్తా క్రికెట్‌ ఆడడం మొదలు పెట్టింది. అక్కడి నుంచి ఆట పట్ల ఆమెకు ఇష్టం పెరుగుతూ పోయింది. ఆమె భారతదేశం గర్వపడేలా చేస్తుందని మాకు ముందు నుంచీ తెలుసు. 2011లో భారత జట్టులో చేరినప్పటి నుంచి అదే చేస్తోంది' అని ఏక్తా తండ్రి తెలిపాడు.

పదేళ్ల పాటు టీ కొట్టుని నడిపిన ఏక్తా తండ్రి

పదేళ్ల పాటు టీ కొట్టుని నడిపిన ఏక్తా తండ్రి

సుమారు పదేళ్ల పాటు ఏక్తా తండ్రి కుందన్ టీ కొట్టుని నడిపాడు. ఇక్కడ గమనించాల్సన విషయం ఏమిటంటే క్రికెట్ ఆడే అమ్మాయిలు లేకపోవడంతో ఏక్తా మగపిల్లలో కలిసి క్రికెట్‌ ఆడేదట. 'క్రికెట్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎంతగా అంటే ఆమె అబ్బాయిలతో కూడా క్రికెట్‌ ఆడేది. అబ్బాయిల మధ్య ఏక్తా ఒక్కతే అమ్మాయి కావడంతో చాలా మంది ఆట చూసేందుకు వచ్చేవారు' అని పేర్కొన్నాడు.

ఆర్థికంగా ఇబ్బంది పడ్డా కుమార్తెకు అండగా నిలిచాం

ఆర్థికంగా ఇబ్బంది పడ్డా కుమార్తెకు అండగా నిలిచాం

ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డా ఏక్తాకు పూర్తిగా అండగా నిలిచామని ఆయన అన్నాడు. ఆమె ఎంతో బాధ్యతాయుతంగా ఉండేదని, అప్పట్లో ట్రయల్స్‌ సందర్భంగా మేమిచ్చే డబ్బును చాలా పొదుపుగా వాడుకునేదని అని ఏక్తా తల్లి తెలిపింది. అయితే ఆ తర్వాత కాలంలో పెన్షన్‌ పెరగడంతో టీ కొట్టును మూసేసినట్లు ఆమె తెలిపింది.

బంతిని వేగంగా వికెట్ల మీదకు విసరగలదు

బంతిని వేగంగా వికెట్ల మీదకు విసరగలదు

ఎడమ చేతి వాటం బౌలింగ్‌తో ఆరంభం అందర్ని ఆకట్టుకున్న ఏక్తా బంతిని వేగంగా వికెట్ల మీదకు వచ్చేలా వేయడంలో స్పెషలిస్ట్‌. 2006లో ఉత్తర ప్రదేశ్ జట్టుకు ఎంపికైన ఆమె.. దేశవాళీ పోటీల్లో సత్తా చాటి.. 2011లో నాలుగు దేశాల వన్డే టోర్నీలో పాల్గొన్న భారత వన్డే జట్టులో చోటు సంపాదించింది.

ఫ్లయిటెడ్‌ డెలివరీలు ఏక్తా ప్రత్యేకత

ఫ్లయిటెడ్‌ డెలివరీలు ఏక్తా ప్రత్యేకత

ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్న బిస్త్‌ (2/32) ఆ తర్వాత గౌహర్‌ సుల్తానాకు పోటీగా తయారైంది. మిగిలిన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లతో పోలిస్తే బంతిని వేగంగా వేయడం కూడా ఆమెకు కలిసొచ్చింది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ తప్పకపోవడం, ఫ్లయిటెడ్‌ డెలివరీలు వేయడం ఆమె బలాలుగా మారాయి.

టీ20 టోర్నీలో హ్యాట్రిక్‌ చేసి చరిత్ర

టీ20 టోర్నీలో హ్యాట్రిక్‌ చేసి చరిత్ర

ఆమె తీసిన వికెట్లలో ఎక్కువగా బౌల్డ్‌ లేదా ఎల్బీడబ్ల్యూలే అంటే ఆమె బౌలింగ్‌‌ను చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2012లో కొలంబోలో జరిగిన ప్రపంచ టీ20 టోర్నీలో హ్యాట్రిక్‌ చేసి చరిత్ర సృష్టించింది. ఏ ఫార్మాట్లో అయినా హ్యాట్రిక్‌ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ఈ ప్రదర్శనే బిస్త్‌కు భారత మహిళల జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+