For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూనమ్ రౌత్ అవుట్: ఆ నిర్ణయమే భారత్ కొంప ముంచింది

వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమికి కారణం ఒత్తిడిని అధిగమించలేక పోడవమేనని ఓటమి అనంతరం కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పిన మాటలివి.

By Nageshwara Rao

హైదరాబాద్: వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమికి కారణం ఒత్తిడిని అధిగమించలేక పోడవమేనని ఓటమి అనంతరం కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పిన మాటలివి. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరిగిన ఫైనల్లో 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి 9 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాట్స్ ఉమెన్లలో ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌(86) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ష్రుబ్‌షోలే 4/45తో భారత వికెట్ల పతనంలో కీలక పాత్ర పోషించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అదే

మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అదే

అయితే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ వికెట్‌ను కోల్పోవడమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 191/3 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న భారత్‌ను ఇంగ్లండ్‌ బౌలర్‌ ష్రబ్‌సోల్‌ దెబ్బతీసింది. పూనమ్‌ రౌత్(86)ను 43 ఓవర్‌లో ష్రబ్‌సోల్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చింది.

సుష్మా వర్మ డకౌట్‌గా వెనుదిరగడం

సుష్మా వర్మ డకౌట్‌గా వెనుదిరగడం

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సుష్మా వర్మ పరుగులేమి చేయకుండా వెనుదిరగడంతో భారత బ్యాట్స్‌ ఉమెన్‌లపై ఒత్తిడి పెరిగింది. అయినా వేద కృష్ణమూర్తి(35) క్రీజులో ఉండటం.. దూకుడుగా ఆడే దీప్తి శర్మ బ్యాటింగ్‌ రావడంతో భారత్‌ గెలుపు ఖాయమని అందరూ భావించారు. ఈ క్రమంలో వేదా కృష్ణమూర్తి అనవసర షాట్‌కు ప్రయత్నించి భారీ మూల్యం చెల్లించుకుంది.

మ్యాచ్ ఇంగ్లాండ్ వైపుకి టర్న్ తీసుకుంది

మ్యాచ్ ఇంగ్లాండ్ వైపుకి టర్న్ తీసుకుంది

దీంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపుకి టర్న్ తీసుకుంది. చివర్లో శిఖా పాండే, దీప్తి శర్మ కుదురుగా ఆడినట్లు కనిపించినప్పటికీ వీరిద్దరూ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మరోవైపు శిఖా పాండే అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయింది. అంతేకాదు ఇక్కడ కెప్టెన్ మిథాలీ రాజ్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా క్రికెట్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు.

ఆ నిర్ణయం భారత్ కొంప ముంచింది

ఆ నిర్ణయం భారత్ కొంప ముంచింది

బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో వికెట్‌గా క్రీజులోకి వచ్చే దీప్తి శర్మను చివర్లో బ్యాటింగ్‌ పంపడం కూడా భారత్‌ను కొంపముంచిందని అంటున్నారు. విజయానికి 38 పరుగులే కావల్సిన సందర్భంలో దీప్తీని బ్యాటింగ్‌ పంపించకుండా సుష్మా వర్మ బ్యాటింగ్‌ రావడం ఎవరూ ఊహించలేదు. పూనమ్‌ రౌత్‌ వికెట్‌ అనంతరం దీప్తి బ్యాటింగ్‌ వస్తే పరిస్థితి మరోలా ఉండేది. అది కాకుండా బ్యాటింగ్‌కు వచ్చిన వెంటనే సుష్మా వర్మ డకౌట్‌ కావడంతో భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+