Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ప్లే‌ఆఫ్స్: మూడు జట్లతో మహిళల టీ20కి బీసీసీఐ ఆతిథ్యం

Womens T20 triangulars set to be hosted during IPL playoffs

హైదరాబాద్: గతేడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ మ్యాచ్ సందర్భంగా ఓ మహిళల టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌ని బీసీసీఐ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, మహిళల క్రికెట్‌ను అభిమానులకు మరింతగా చేరువచేసే క్రమంలో ఈ ఏడాది మూడు జట్లతో మ్యాచ్‌లను నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సిద్ధమైంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో భాగంగా ఈ మూడు జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్‌లకు చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గత సీజన్‌లో

గత సీజన్‌లో

వివరాల్లోకి వెళితే... గత ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్ మ్యాచ్ సందర్భంగా ముంబైలోని వాంఖడె వేదికగా రెండు జట్లతో మహిళల టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌ని బీసీసీఐ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో ఒక్కో జట్టులో మొత్తం 14 మంది ఆటగాళ్లతో మూడు జట్లు పాల్గొనేలా బీసీసీఐ ప్లాన్ సిద్ధం చేసింది.

విదేశీ మహిళా ప్లేయర్లు సైతం

విదేశీ మహిళా ప్లేయర్లు సైతం

ఇందులో విదేశీ మహిళా ఆటగాళ్లు కూడా ఉంటారు. మహిళల టీ20 క్రికెట్‌లో టాప్ ప్లేయర్లుగా కొనసాగుతున్న డేన్ వాన్ నైక్రెక్, డ్యాండ్రా డాట్టిన్, మరీజనే కప్, చమరి అటపట్టులను బీసీసీఐ ఆహ్వానించింది. ఇప్పటికే మహిళల కోసం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్‌లో కియా సూపర్ లీగ్‌లు ఉన్నాయి.

బిగ్ బాష్, కియా మాదిరి భారత్‌లో కూడా

బిగ్ బాష్, కియా మాదిరి భారత్‌లో కూడా

వీటి మాదిరే బీసీసీఐ కూడా పూర్తిస్ధాయి లీగ్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పురుషుల ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో మూడు జట్లతో ఆడించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మ్యాచ్‌లు పురుషుల ప్లేఆప్ మ్యాచ్‌లు జరిగే వేదికల్లోనే సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు.

సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌లు

సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌లు

ఆ తర్వాత రాత్రి 8 గంటలకు పురుషుల ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో రెండు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు, ఒక ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఈ ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం ఇంకా వేదికలను అధికారికంగా ఖరారు చేయలేదు. ఫైనల్ మ్యాచ్ మాత్రం ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది.

Story first published: Monday, April 8, 2019, 18:20 [IST]
Other articles published on Apr 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+