మహిళల టీ20 ఛాలెంజ్.. సూపర్ నోవాస్‌తో ట్రైల్‌బ్లాజర్స్ ఢీ

పురుషుల ఐపీఎల్ సీజన్-12 చివరి అంకానికి చేరింది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగియగా.. కేవలం ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. మంగళవారం ముంబై, చెన్నై జట్ల మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది. ఇన్ని రోజులు పురుషుల క్రికెట్ చూసి తరించిన అభిమానులు సోమవారం మహిళల ఐపీఎల్ క్రికెట్‌ను కూడా చూడబోతున్నారు.

సూపర్ నోవాస్‌తో ట్రైల్‌బ్లాజర్స్ ఢీ:
సోమవారం నుంచి ఐపీఎల్ మహిళల టీ20 ఛాలెంజ్ ప్రారంభమవుతోంది. భవిష్యత్‌లో మహిళల ఐపీఎల్ నిర్వహించడం కోసం ప్రయోగాత్మకంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టీ20 ఛాలెంజ్ టోర్నీలో సూపర్ నోవాస్, ట్రైల్‌బ్లాజర్స్, వెలాసిటీ జట్లు పోటీపడుతున్నాయి. భారత స్టార్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. తొలి మ్యాచ్‌లో సూపర్ నోవాస్, ట్రైల్‌బ్లాజర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈనెల 11న ఫైనల్:
టీ20 ఛాలెంజ్ టోర్నీలో భారత్ క్రీడాకారిణులతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. లీగ్ దశలో ప్రతి జట్టూ మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం టాప్ రెండు జట్లు ఫైనల్‌కు చేరతాయి. ఈనెల 11న జైపుర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు జైపూర్ వేదికగా జరగనున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

తొలి ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్:
గత సంవత్సరం రెండు జట్లతో బీసీసీఐ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. తొలి ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ వాంఖెడే స్టేడియంలో జరిగింది. భారత మహిళా ఆటగాళ్లు స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్-సూపర్‌నోవాస్ జట్ల మధ్య ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ సంవత్సరం మహిళల టీ20 ఛాలెంజ్‌టోర్నీలో బీసీసీఐ మరో జట్టును అదనంగా జోడించింది.

Schedule:
May 6 - Supernovas vs Trailblazers
May 8 - Trailblazers vs Velocity
May 9 - Supernovas vs Velocity
May 11 - Final
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications