For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడే మహిళల ఛాలెంజ్ ప్రారంభం.. నేటి మ్యాచ్‌లో ఆడబోయే ఆడపులులు వీరే

 Womens T20 Challenge begins today .. Trail Blazers vs Supernovas Playing 11 Squads

మహిళల టీ20 ఛాలెంజ్ 2022 ఎడిషన్ సోమవారం పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు పూణేలోని ఇదే స్టేడియంలో జరగనున్నాయి. గత ఎడిషన్లలో మాదిరిగానే మూడు జట్లు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నాయి. మే 28న ఫైనల్ జరగనుంది. ఇక ఈ టోర్నీలో మొదటి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ట్రైల్‌బ్లేజర్స్ వర్సెస్ సూపర్‌నోవాస్ మధ్య జరుగుతుంది. ట్రైల్‌బ్లేజర్స్‌కు ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్సీ వహిస్తుండగా, సూపర్‌నోవాస్‌కు వెటరన్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. రెండు జట్లు మేటి మహిళ సూపర్ స్టార్ ఆటగాళ్లను కలిగి ఉన్నాయి. రెండు హేమాహేమీ మధ్య ఈ టోర్నీని ప్రారంభించడం ఉత్కంఠకరంగా ఉంటుంది. పిచ్ రిపోర్ట్ ప్రకారం.. పుణెలోని ఎంసీఏ స్టేడియంలోని పిచ్ టర్ఫ్‌పై ఆడిన దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో జట్లు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యాయి. ఈ వికెట్‌పై మహిళల జట్లు 125-135స్కోరు చేస్తే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేయాలనుకోవచ్చు.

ట్రైల్‌బ్లేజర్స్ vs సూపర్‌నోవాస్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI జట్లు ఇవే
ట్రైల్‌బ్లేజర్‌లు
స్మృతి మంధాన (సి), హేలీ మాథ్యూస్, జెమిమా రోడ్రిగ్స్, షర్మిన్ అక్తర్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (WK), సోఫియా డంక్లీ, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి గయాక్వాడ్, సల్మా ఖాతున్
సూపర్నోవాస్
డియాండ్రా డోటిన్, ప్రియా పునియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), సునే లూస్, హర్లీన్ డియోల్, తానియా భాటియా (WK), పూజా వస్త్రాకర్, సోఫీ ఎక్లెస్టోన్, అలనా కింగ్, మాన్సీ జోషి, మేఘనా సింగ్

Story first published: Monday, May 23, 2022, 11:58 [IST]
Other articles published on May 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+