Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమెన్ వరల్డ్ కప్: భారత్ ఓటమి, సెమీస్ ఆశలు సంక్లిష్టం

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత్తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.

అనంతరం 227 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 45.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్‌లో కెప్టెన్ ల్యానింగ్‌ (88 బంతుల్లో 76; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఎల్లిస్‌ పెర్రీ (67 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.

మరోవైపు ఓపెనర్లు మూనీ (45), బోల్టన్‌ (36) చెప్పుకోదగ్గ స్కోరు చేయడంతో ఆసీస్‌ అలవోక విజయాన్ని సాధించింది. భారత్‌ బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ మాత్రమే ఒక్క వికెట్‌ తీసింది. దీంతో భారత్ తరపున రౌత్ చేసిన సెంచరీ వృధా అయింది. తాజా విజయంతో ఆసీస్ సెమీస్‌కు చేరింది.

భారత్‌ నిర్దేశించిన 227 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆసీస్‌ ఆచితూచి ఆడింది. తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా చేయలేదు. ఆ తర్వాత ఓపెనర్లు బోల్టన్‌, మూనీ చక్కని భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. బోల్టన్‌ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ల్యానింగ్‌ మూనీతో కలిసి కెప్టెన్స్‌ ఇన్నింగ్స్‌ ఆడింది.

మూనీ రనౌట్‌గా అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన పెర్రీ దూకుడుగా ఆడడంతో ఆ జట్టు మరో 29 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (3) స్వల్ప స్కోరుకే గార్డనర్‌ బౌలింగ్‌లో అవుటైంది.

 Women's Cricket World Cup 2017

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ మిథాలీ ఓపెనర్‌ రౌత్‌తో కలిసి చక్కటి ఇన్నింగ్స్‌ ఆడింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీలు నమోదు చేశారు. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని బీమ్స్‌ విడదీసింది. మిథాలీని అవుట్ చేసింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 157 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఓపెనర్‌ రౌత్‌ కూడా పెవిలియన్‌కు చేరింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(23) పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌ ఓటమితో సెమీస్‌ అవకాశాలను భారత్‌ సంక్లిష్టం చేసుకుంది. దీంతో 15న న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌ కీలకంగా మారింది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో బుధవారం ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని, మిథాలీ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి సెమీస్‌ బెర్తు దక్కుతుంది.

 Women's Cricket World Cup 2017: Australia win toss, elect to bowl against India

దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ టోర్నీలో పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్‌, విండీస్‌, పాక్‌, శ్రీలంకపై నెగ్గి మిథాలీ సేన వరుసగా నాలుగు విజయాలను సాధించింది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో 115 పరుగుల భారత్ ఘోర ఓటమిని చవిచూసింది.

ఈ పరాజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసిందనే చెప్పాలి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా వరుసగా నాలుగు విజయాలు సాధించి ఇంగ్లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో నెగ్గి సెమీస్‌ బెర్తు దక్కించు కోవాలని చూస్తున్నాయి.

సెమీస్‌లో స్థానం సాధించాలంటే రాబోయే రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించాలి. దీంతో పాటు రన్‌రేట్‌ కూడా మెరుగు పరుచుకోవాల్సి ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ జోరును అడ్డుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సిందే. మరోవైపు ఆసీస్‌పై ఫలితం తేలిన 41 మ్యాచ్‌ల్లో భారత్‌ 8 మ్యాచ్‌ల్లోనే గెలవడం విశేషం.

జట్ల వివరాలు:

టీమిండియా:

ఆస్ట్రేలియా:

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+