ఆసుపత్రి నుండి బయటికి పంపించేశారు
ఆదివారం గంభీర్ నియోజకవర్గంలోని ఉన్నతి మదన్ అనే మహిళ గంభీర్ సోషల్ మీడియా ఖాతాను ఆశ్రయించి తన తండ్రి అనారోగ్యం గురించి తెలిపి సాయం కోరింది. 'సర్ నాకు సహాయం కావాలి. మా నాన్నకు ఆరోగ్యం బాగా లేదు. నాన్నకు సీఎల్డీ వ్యాధి కారణంగా అవయాలు దెబ్బతిన్నాయి. గత 48 గంటలుగా ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అక్కడ పడకల సౌకర్యం లేకపోవడంతో బయటికి పంపించేశారు' అని ఉన్నతి మదన్ ట్వీట్ చేశారు.
నాన్నను కాపాడండి సర్
'దగ్గరలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఏవో కారణాలు చెప్పి చేర్చుకోవడం లేదు. చివరకు సఫ్దర్‌జంగ్‌లో చేర్చాను. అక్కడ నాన్న నేలపై పడుకోలేకపోతున్నాడు. నేను ప్రైవేట్ చికిత్సకు అయ్యే ఖర్చు భరించలేనందున చికిత్స ఆగిపోయింది. నాకు, తమ్ముడికి నాన్నే అంతా. దయచేసి మా నాన్నను కాపాడండి సర్' అని ఉన్నతి మదన్ మరో ట్వీట్ చేశారు.
మీ మొబైల్ నెంబర్ పంపించండి
ఈ ట్వీట్ చూసిన గంభీర్ వెంటనే స్పందించాడు. 'వీలైనంత తొందరగా మీ మొబైల్ నెంబర్ పంపించండి' అని గంభీర్ రిప్లై ఇచ్చాడు. వెంటనే ఉన్నతి మదన్ తన మొబైల్ నెంబర్ పంపించింది. దీంతో గంభీర్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి అనంతరం గంభీర్ సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నాడు.


Click it and Unblock the Notifications
