Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: స్టేడియం నింపేసిన నీలి సంద్రం.. చూసి షాకైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్!

వరల్డ్ కప్‌ 2023లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగుతున్న భారీ హైటెన్షన్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ఫ్యాన్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దీనివల్ల స్టేడియంలో పాక్ ఫ్యాన్స్ చాలా తక్కువగా కనపడుతున్నారు.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే రెండు దేశాల ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. అదే ఆ మ్యాచ్ వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో అయితే ఇంటెన్సిటీ రెట్టింపవుతుంది. మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా క్షణాల్లో అమ్ముడైపోతాయి. స్టేడియం మొత్తం బ్లూ, గ్రీన్ కలర్స్‌తో నిడిపోతుంది.

 Wolrd Cup 2023 INDvsPAK Sea of Blue in Ahmedabad as Pakistan fans did not get visas

భారత్, పాకిస్తాన్ ఫ్యాన్స్‌ పోటాపోటీగా తమ జట్లకు సపోర్ట్ చేస్తూ నినాదాలు చేస్తుంటారు. కానీ ఈ సారి అహ్మదాబాద్ స్టేడియంలో జరగుతున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు అయితే అమ్ముడయ్యాయి కానీ.. పాక్ ఫ్యాన్స్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను లైవ్‌లో చూడాలని ఎంతోమంది పాకిస్తాన్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, వాళ్లందరి ఆశలను భారత ప్రభుత్వం నిరాశ చేసింది. పాక్ నుంచి భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ఫ్యాన్స్ అప్లై చేసుకున్న వీసాలను భారత ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. అయితే కొంతమంది పాక్ జర్నలిస్ట్‌లకు మాత్రం వీసాలు లభించడంలో భారత్ చేరుకున్నారు.

Babar Azam Responds On Crowd In Ahmedabad Stadium

పాక్ ఫ్యాన్స్ లేకపోవడంతో ఇప్పుడు 1,32,000 మంది స్టేడియం దాదాపు భారత అభిమానులతోనే నిండిపోయింది. స్టేడియం మొత్తం ఎటు చూసినా బ్లూ కలర్ జెర్సీలు, మూడు రంగుల జెండాలు మాత్రమే కనపడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే పాక్ ఫ్యాన్స్ వీసాలు రిజెక్ట్ కావడంపై బాబర్ ఆజమ్ స్పందించాడు. ప్రత్యర్థి జట్ల ఫ్యాన్స్‌తో నిండిన స్టేడియంలో ఆడడం తమకు కొత్తేమీ కాదని, అయితే తమ ఫ్యాన్స్ కూడా ఉండి ఉంటే బాగుండేదని అన్నాడు.

Story first published: Saturday, October 14, 2023, 14:27 [IST]
Other articles published on Oct 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+