Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2017 సంవత్సరానికి ‘గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ ఏంటో తెలుసా?

Woah! Anushka Sharma's Wedding Announcement Is Golden Tweet Of The Year

హైదరాబాద్: 2017లో అత్యధిక మంది ఎక్కువగా చర్చించుకున్న విషయాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ నటి అనుష్క శర్మల మ్యారేజి ఒకటిగా నిలిచింది. డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ వివహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వివాహ అనంతరం తామిద్దరం ఒక్కటయ్యామని అటు విరాట్ కోహ్లీ, ఇటు అనుష్క శర్మ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు శ్రీలంక సిరిస్ నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో పెళ్లి కోసమే కోహ్లీ లంక సిరిస్ నుంచి తప్పుకున్నాడంటూ పలు ఊహాగానాలతో కూడిన వార్తలు బయటకు వచ్చాయి.

అందరూ ఊహించినట్లే పెళ్లి అనంతరం పెళ్లి ఫొటోను జత చేస్తూ తామిద్దరం ఒక్కటయ్యామంటూ అనుష్క శర్మ చేసిన ట్వీట్‌ 2017 సంవత్సరానికి గాను 'గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ద ఇయర్‌'గా నిలిచిందని ట్విటర్‌ అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు ఈ ట్వీట్‌ ఎక్కువగా రీట్వీట్‌ అయిందని కూడా పేర్కొంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 12:49 [IST]
Other articles published on Dec 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+