Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WIvsIND : ఈ ముగ్గురికీ అంత సీన్ లేదు.. కానీ టీ20 టీంకు ఎంపిక చేశారు!

వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో కూడా కుర్రాళ్లకే పెద్ద పీట వేశారు సెలెక్టర్లు. అయితే ఈ టీంలో కొందరు ఆటగాళ్లకు చోటివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలంలో వాళ్ల ఫామ్ అంత చెత్తగా ఉంది. దానికితోడు వైట్ బాల్ క్రికెట్‌లో వారి గణాంకాలు కూడా అంత గొప్పగా లేవు. వాళ్లెవరంటే?

ముఖేష్ కుమార్: ఈ బెంగాలీ పేసర్ రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న మాట నిజమే. దేశవాళీ టెస్టుల్లో అతను అదరగొట్టాడు. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో ముఖేష్ రికార్డు అంత గొప్పగా లేదు. కేవలం రెడ్ బాల్ క్రికెట్‌లో రాణించాడని అతనికి టీ20ల్లో చోటివ్వడం ఎంత వరకు సమంజసం? అని కొందరి ప్రశ్న.

ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా ముఖేష్ అంత గొప్పగా రాణించలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఓవరాల్‌గా చూసుకున్నా కూడా ఇప్పటి వరకు 33 టీ20లు ఆడిన ముఖేష్ కేవలం 32 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అతని ఎకానమీ కూడా 8.11గా ఉంది. ఇక బ్యాటింగ్‌లో అయితే అతన్నుంచి ఏం ఆశించలేం.

These three players are not in their right game

ఉమ్రాన్ మాలిక్: భారత క్రికెట్‌లో ఎవరి దగ్గరా లేని రా-పేస్ ఉమ్రాన్ సొంతం. దీంతోనే గతేడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. ఇది చూసిన సెలెక్టర్లు అతనికి టీ20ల్లో చోటిచ్చారు. కానీ అతను ఈ అవకాశాన్ని అంత గొప్పగా వాడుకోలేకపోయాడు. మొత్తం 8 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఉమ్రాన్ ఏకంగా 10.48 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు.

అతని పేలవ ఫామ్ చూసిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచులు ఆడించలేదు. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్నా కూడా తన ఆటను మెరుగు పరుచుకోవడంలో ఉమ్రాన్ విఫలం అయ్యాడు. లేదంటే ఇప్పటికే టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉండాల్సిన వాడతను.

ఆవేష్ ఖాన్: ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసిన మరో బౌలర్ ఆవేష్ ఖాన్. ఐపీఎల్‌లో అరంగేట్ర సీజన్‌లో అదరగొట్టిన తర్వాత ఆవేష్ బౌలింగ్ బాగా దెబ్బతిన్నది. పేస్ పడిపోవడంతోపాటు వేరియేషన్లు, అక్యురసీ కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఆవేష్ ఖాన్ కెరీర్ గాడి తప్పింది.

ఈ ఏడాది 13 ఐపీఎల్‌ మ్యాచులు ఆడి, కేవలం 8 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 15 టీ20లు ఆడిన అతను 9.1 ఎకానమీతో కేవలం 13 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్న అతను భుజం గాయంతో బాధ పడుతున్నాడు. అలాంటి వాడిని విండీస్ టూర్‌కు ఎందుకు ఎంపిక చేశారో సెలెక్టర్లే చెప్పాలి.

భారత బృందం: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషణ్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్.

Story first published: Thursday, July 6, 2023, 19:30 [IST]
Other articles published on Jul 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+