For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భార్యలకు అనుమతితో పాటు.. అరటి పండ్లు ఇప్పించండి!!

India Vs West Indies 2018, 4th ODI : Team India’s Reported Wish List for 2019 World Cup | Oneindia
Wives on tour, rail travel, bananas: Team India’s reported wish list for 2019 World Cup

హైదరాబాద్: ప్రపంచ కప్ గడువు సమీపిస్తోన్న తరుణంలో టీమిండియా తమ డిమాండ్లను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీఓఏ) ముందు ఉంచింది. భార్యలను తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతి కల్పించాలని కోరింది. దానితో పాటుగా ఓ రైలు కోచ్ కావాలని, తినేందుకు అరటి పండ్లు కావాలని హైదరాబాద్‌లో జరిగిన సీఓఏ రివ్యూ మీటింగ్‌‌కు భారత ఆటగాళ్ల నుంచి వినతులు అందాయి.

అరటిపండ్లను సైతం అందించలేని ఇంగ్లాండ్

అరటిపండ్లను సైతం అందించలేని ఇంగ్లాండ్

ఇటీవలే భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకొని వచ్చింది. అక్కడి లోటుపాట్లను ముందే తెలుసుకున్న టీమిండియా అనుభవాల రీత్యా వరల్డ్ కప్ సమయంలో ఇంగ్లాండ్‌లో తమకేం కావాలో తెలిపింది. గత పర్యటనలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ భారత ఆటగాళ్లు కోరిన పండ్లను అందించలేక పోయింది. దీంతో తమకు ఈసారి అరటి పండ్లు కావాలని వారు సీఓఏను డిమాండ్ చేశారు.

ఆ రికార్డుకు ఒక్క పరుగు దూరంలో ధోనీ..

మంచి జిమ్‌తో.. తమ వెంట భార్యలను

మంచి జిమ్‌తో.. తమ వెంట భార్యలను

దీనికి కమిటీ బదులిస్తూ.. ఈ విషయాన్ని జట్టు మేనేజర్‌కు చెప్పి బోర్డు ఖర్చులతో అరటి పండ్లు కొనుగోలు చేయాలని చెప్పినట్టు సమాచారం. పనిలో పనిగా మంచి జిమ్ సౌకర్యం ఉన్న హోటల్స్‌లో వసతి కల్పించాలని అందులో జోడించారు. ముందునుంచి అనుకున్నట్లుగానే భార్యలను తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు.ఇంకా వాయిదా ఉన్న నిర్ణయంలో ఒకవేళ ఆటగాళ్ల భార్యలు వస్తే మాత్రం వారిని ఆటగాళ్లతో పాటు ప్రయాణించడానికి సీఓఏ అంగీకరించలేదు.

ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరవడుతుందని

ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరవడుతుందని

వారి కోసం ప్రైవేట్ బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపింది. పర్యటనల సమయంలో కొందరు ఆటగాళ్లు భార్యలతో కలిసి వేర్వేరుగా ప్రయాణించే వారు. ఇలా చేయడం వల్ల జట్టులోని ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరవడుతుందని సీఓఏ భావించింది. విండీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన రివ్యూ మీటింగ్‌లో కోహ్లి, రహానే, రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రితోపాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పాల్గొన్నారు.

సమయం ఆదా అవుతుందని.. భద్రతాపరమైన:

సమయం ఆదా అవుతుందని.. భద్రతాపరమైన:

వరల్డ్ కప్ సమయంలో రైలు ప్రయాణం వల్ల సమయం ఆదా అవుతుందని చెప్పిన ఆటగాళ్లు, తమకు ప్రత్యేకంగా ఓ బోగీని బుక్ చేయాలని కోరారు. కానీ అభిమానుల కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని సీఓఏ అభిప్రాయపడింది. వచ్చే నెలలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ జట్టు కూడా రైల్లోనే వెళ్తుందని క్రికెటర్లు సీఓఏకి తెలిపారు. ఏదైనా జరగరానిది జరిగితే సీఓఏకి గానీ బీసీసీఐకి గానీ సంబంధం లేదనే నిబంధనతో సీఓఏ ఇందుకు అంగీకరించింది.

Story first published: Tuesday, October 30, 2018, 12:08 [IST]
Other articles published on Oct 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+