Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డెక్కన్ - కోల్‌కత్తా మ్యాచ్‌పై గంగూలీ ప్రభావం, అభిమానులు లేక విలవిల

Eden Gardens
కోల్‌కత్తా: భారతదేశంలోనే అత్యుత్తమమైన స్టేడియంగా చెప్పుకునే స్టేడియం ఈడెన్ గార్డెన్స్. అలాంటి ఈడెన్ గార్డెన్స్‌లో క్రికెట్ మ్యాచ్ అంటే స్టేడియం మొత్తం కిక్కిరిసి పోవాల్సిందేనని అందరం భావిస్తాం. కానీ నిన్న జరిగినటువంటి ఐపిఎల్ 4 సీజన్‌లో మొట్టమొదటి సారి కోల్ కత్తా నైట్ రైడర్స్‌కి డెక్కన్ ఛార్జర్స్ కి మద్య జరిగినటువంటి మ్యాచ్‌లో కుర్చీలు అన్ని చాలా ఖాళీగా కనిపించాయి. దీనికి కారణం అక్కడ మ్యాచ్‌లో కోల్ కత్తా ప్రిన్స్ గంగూలీ లేకపోవడమేనని అంటున్నారు.

ఈడెన్ గార్డెన్ స్టేడియం మొత్తం కెపాసిటీ 63,500 ఉండగా నిన్న జరిగిన మ్యాచ్‌కి కేవలం 20,000 మందే హాజరయ్యేరంటే గంగూలీ ప్రభావం ఎంత మేరకు ఆ టీమ్‌ని చూపించిందో మనం ఆలోచించుకోవచ్చు. ఐతే గతంలో గంగూలీ టీమ్‌లో ఉన్నప్పుడు ఇలా జరగలేదు. ఈ విషయంపై కోల్ కత్తా నైట్ రైడర్స్ టిక్కెట్స్ ఇన్ ఛార్జి అభిషేక్‌ని ప్రశ్నించగా అతని సమాధానం చాలా రూడ్‌గా ఉంది. మేము టిక్కెట్లుకి సంబంధించినటువంటి విషయాలను మీడియాతో మాట్లాడదలచుకోలేదు. నేను మీకు పదే పదే చెబుతున్నాను నాకు బెంగాళీ రాదు నన్ను ఏమి అడగవద్దు అంటూ విసుక్కోని అక్కడి నుండి వెళ్శిపోయాడు.

ఇది మాత్రమే కాకుండా క్లబ్ హౌస్ లలో కూడా చాలా ఖాళీ సీట్లు ఉన్నాయి. ఎక్కవ శాతం సీట్లు బి, యఫ్, జె బ్లాక్స్ లలో ఉండడం మీరు ఈ చిత్రంలో గమనించవచ్చు. దీనికి అంతటికి కారణం ఏమిటని మిగిలిన బ్లాక్ లలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులను అడడగానే మేము అందరం గంగూలీని మిస్ అవతున్నాం అని వారి సమాధానాలు వెలిబుచ్చారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+