యువ క్రికెటర్ల దూకుడుతో దూసుకుపోతోన్న టీమిండియా


హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో రెండో టెస్టులోనూ అదే ఆధిక్యం. తొలి టెస్టు ఏకాధిపత్యం వహించినా.. రెండో టెస్టులో బౌలర్లు కాస్త మెరుగ్గా రాణించారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా చెలరేగిపోయారు భారత బౌలర్లు. రెండో టెస్టులో ఆతిథ్యమిచ్చిన ఉప్పల్ స్టేడియం మరోసారి భారత విజయానికి వేదిక అయింది. ఇక్కడి పిచ్ పేసర్లకు బాగానే సహకరించింది. విండీస్ ఫాస్ట్‌బౌలర్లు పేస్, బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుని బాగానే బౌలింగ్ చేశారు.

కోహ్లి సైతం ఆచితూచి ఆడాల్సి
రెండో రోజు చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, కేఎల్ రాహుల్ లాంటి అనుభవజ్ఞులు తడబడ్డ తీరే అందుకు నిదర్శనం. కోహ్లి సైతం ఆచితూచి ఆడాల్సి వచ్చింది. బంతి గమనాన్ని నిర్దేశించేందుకు సీనియర్లు సైతం తికమకపడ్డారు. కానీ, యవ క్రికెటర్ పృథ్వీ షా మాత్రం బంతిని కొట్టడమే టార్గెట్‌గా పెట్టుకుని రెచ్చిపోయాడు. ధైర్యంగా.. ఆడుతూ బంతుల్ని బౌండరీలకు తరలించాడు.

సెంచరీ,. హాఫ్ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్
చిన్న వయసులోనే.. ఒక టెస్టు అనుభవంతోనే ఆశ్చర్యకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు రన్‌రేట్ ఐదుకు తగ్గలేదు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈ ముంబై కుర్రాడు అదే దూకుడు ప్రదర్శించాడు. ఆత్మవిశ్వాసంతో ఆడి లక్ష్యాన్ని కరిగించాడు. అరంగేట్ర సిరీస్‌లోనే ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీతో అదరగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' సొంతం చేసుకున్నాడు షా.

రహానె సింగిల్‌కు ఇబ్బంది పడుతున్నా.. పంత్ రెచ్చిపోయి
మరోవైపు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కూడా సిరీస్‌లో చక్కగా రాణిస్తున్నాడు. వరుసగా రెండు టెస్టుల్లోనూ పంత్ 90కి పైగా స్కోరు నమోదు చేశాడు. రెండో రోజు ఓవైపు రహానె సింగిల్ తీయడానికి ఇబ్బంది పడుతున్నా.. పంత్ మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. వన్డే తరహా ఆటతీరుతో రహానెకు ధైర్యాన్నిస్తూ.. టీమిండియాలో ఆత్మవిశ్వాసం నింపాడు. క్రీజులో కుదురుకోగానే సిక్సర్లతో చెలరేగాడు.

భారత క్రికెట్‌కు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు
తొలి టెస్టు నుంచే ఆత్మవిశ్వాసం, పరిణతి చూపిస్తున్న షా, పంత్ ఆస్ట్రేలియా పర్యటనకు దాదాపుగా టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లే. ఐతే స్వదేశంలో విండీస్‌పై ఆడినట్లు ఆస్ట్రేలియాలో ఆడితే కుదరదు. అక్కడి పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అక్కడ కూడా వీళ్లిద్దరూ ఇదే ఊపు కొనసాగించారంటే మాత్రం భారత క్రికెట్‌కు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు దొరికేసినట్లే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications