రోహిత్ దూరం, ఓపెనర్‌గా విహారి విఫలం: సిడ్నీ టెస్ట్‌కు జట్టు ఎంపికపై డైలమా!

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరిస్ గెలిచి చరిత్ర సృష్టించేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఈ సిరిస్‌లో చివరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనుంది. ఈ టెస్టు కోసం జట్టు ఎంపికపై టీమిండియా తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.
కారణం.. ఈ టెస్టులో తుది జట్టు ఎంపిక సరిగా లేకుండా బరిలోకి ఓటమి పాలైతే చరిత్ర సృష్టించే సువర్ణావకాశాన్ని టీమిండియా కోల్పోతుంది కాబట్టి. మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సీనియర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌పై వేటు వేసి వారి స్థానంలో కొత్త ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, హనుమ విహారీలను ఆడించిన సంగతి తెలిసిందే.

ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ హిట్
అయితే, ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ హిట్ అవగా.. హనుమ విహారి మాత్రం రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పేలవ ప్రదర్శనతో వికెట్‌ను చేజార్చుకున్నాడు. దీంతో హనుమ విహారిని మళ్లీ మిడిలార్డర్‌లోనే ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో గురువారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్టులో తుది జట్టు ఎంపికపై భారత్ డైలమాలో ఉంది.

సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ దూరం
గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమై... మూడో టెస్టులో ఫరవాలేదనిపించిన రోహిత్ శర్మ తన భార్య రితికా ఆదివారం పండంటి పాపకు జన్మనివ్వడంతో భారత్‌కు తిరుగుపయనమైన సంగతి తెలిసిందే. దీంతో సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ దూరం కానున్నాడు. అతడి స్థానాన్ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

రోహిత్ స్థానంలో విహారిని ఆడించాలి
రోహిత్ శర్మ స్థానంలో(మిడిలార్డర్) తిరిగి హనుమ విహారిని ఆడించాలని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. నాలుగో టెస్టులోనూ అతడ్నే ఓపెనర్‌గా ఆడించాలని కూడా మరికొందరు తమ అభిప్రాయలను వెల్లడిస్తున్నారు. దీనికి తోడు మెల్ బోర్న్ టెస్టుకు ముందు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చివరి రెండు టెస్టుల్లో విహారి ఓపెనర్‌గా ఆడతాడని, ఒకవేళ అతను విఫలమైనా తర్వాతి సిరీస్‌లో విహారిని మిడిలార్డర్‌లో ఆడిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

సిడ్నీ టెస్టుకు తుది జట్టులో హార్ధిక్ పాండ్యా
ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుకు ఎంపిక చేసే తుది జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించడం తప్ప మిగతా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ సిరిస్‌లో చివరిదైన నాలుగు టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications