For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో రెండేళ్లు ఆడతా: రిటైర్మెంట్ విషయంలో లసిత్ మలింగ యూ టర్న్

Lasith Malinga Makes U-Turn On Retirement ! || Oneindia Telugu
With my skill, I feel I can manage another 2 years: Lasith Malinga makes u-turn on T20I retirement

హైదరాబాద్: శ్రీలంక టీ20 కెప్టెన్ లసిత్ మలింగ తన రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకున్నాడు. మరో రెండేళ్లు తాను అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ తర్వాత వీడ్కోలు పలకాలన్న తన నిర్ణయంపై పునరాలోచిస్తున్నానని తెలిపాడు.

36 ఏళ్ల లసిత్ మలింగ ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ బుధవారం క్రిక్ ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో "టీ20 అంటే నాలుగు ఓవర్లు. నా నైపుణ్యంతో టీ20ల్లో బౌలర్‌గా కొనసాగొచ్చని అనుకుంటున్నా" అని అన్నాడు.

"నేను ప్రపంచ వ్యాప్తంగా చాలా టీ20లు ఆడాను. మరో రెండేళ్లపాటు కొనసాగలనని అనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకకు కెప్టెన్సీ వహించడంపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో నాయకత్వం వహించమన్నారు. కానీ, శ్రీలంకలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. జట్టు ఎంపికలో నిలకడ అత్యంత కీలకం" అని మలింగ తెలిపాడు.

"శ్రీలంక జట్టులో నైపుణ్యం గల బౌలర్ లేకపోవడం వల్ల జట్టులో స్థిరత్వం లేదు. ఒక సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరాల్లో మేము పొందలేము. అవన్నీ త్వరలోనే పరిష్కబడతాయి. రెండు మూడేళ్లు కొనసాగిస్తేనే జట్టు మెరుగవుతుంది. దీనికి సహనం అవసరం" అని లసిత్ మలింగ్ తెలిపాడు.

"మళ్లీ నేనే కెప్టెన్‌గా ఉంటే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంతో పాటు సలహాలు ఇవ్వగలను. ఏం చేయాలి, ఏం చేయొద్దో చెస్తాను. నేను లేకుంటే వారికెలా చెప్పగలను" అని మలింగ అన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన ఏకైక పేసర్‌ లసిత్ మలింగనే కావడం గమనార్హం.

టీ20 జట్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మలింగ నాయకత్వంలో శ్రీలంక మొత్తం 10 అంతర్జాతీయ టీ20లు ఆడి ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, మరోక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

Story first published: Wednesday, November 20, 2019, 17:44 [IST]
Other articles published on Nov 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+