Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా బాగా రాణించాలని ఆశిస్తున్నా: చంద్రబాబు

Wishing @imVkohli and the team a great match tomorrow.

వైజాగ్: వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడేందుకు టీమిండియా సోమవారమే విశాఖపట్నం తరలి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో జరగాల్సిన రెండో వన్డేను టిక్కెట్ల విషయమై తరలిరావడంతో వైజాగ్ స్టేడియానికి ఈ అవకాశం దక్కింది. ఇప్పటికే ప్రత్యేకత సంతరించుకున్న వైజాగ్ స్టేడియంలో ఆడేందుకు టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అదే క్రమంలో విశాఖపట్నం అందాలను పొగుడుతూ కోహ్లీ ట్వీట్ చేశాడు.

కెప్టెన్ కోహ్లీకి.. సహచర వర్గానికి శుభాకాంక్షలు

వైజాగ్ అద్భుతమైన ప్రదేశమని, ఇక్కడికి రావడం తనకెంతో ఇష్టమని కోహ్లీ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే కోహ్లీ ట్వీట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం రాత్రి కోహ్లీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘జాతీయ స్థాయిలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ విశాఖపట్నం అందరికీ ఇష్టమైన పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఈ విషయం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. రేపటి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీకి, అతని సహచర వర్గానికి శుభాకాంక్షలు అందజేస్తున్నట్లు'ట్వీట్‌లో పేర్కొన్నాడు.

2013 నవంబర్ 24న విండీస్‌తో పరాజయం

2013 నవంబర్ 24న విండీస్‌తో పరాజయం

సరిగ్గా 10 నెలల తరవాత విశాఖలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కిందటేడాది డిసెంబర్ 17న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ స్టేడియంలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు జరగగా.. ఆరింటిలో భారత్ గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దైంది. వెస్డిండీస్‌తో రెండు సార్లు తలపడగా ఒకసారి నెగ్గి.. మరోసారి 2013 నవంబర్ 24న విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం చెందింది.

చాలా పటిష్టంగా కనిపిస్తోన్న భారత జట్టు

చాలా పటిష్టంగా కనిపిస్తోన్న భారత జట్టు

అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం భారత జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు వరుస పరాజయాలతో విండీస్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ పరిస్థితులు, మైదానంలో రికార్డు బట్టిని చూస్తే టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తు్న్నాయి. వైజాగ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. రాత్రి మంచు కురిసే అవకాశముంది. మంచు కురిస్తే బంతిపై పట్టు జారుతుంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గు చూపొచ్చు.

టాస్ ఓడిన జట్టు గెలవదంతే:

టాస్ ఓడిన జట్టు గెలవదంతే:

ఇప్పుడు వన్డేల్లో ప్రతిష్టాత్మక మైలురాయికి కోహ్లి చేరువగా ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించడానికి కోహ్లి మరో 81 పరుగులు చేస్తే చాలు. ఈ మైదానంలో టాస్ ఓడిన జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకపోవడం మరో విశేషం. ఇదిలా ఉంటే, కెప్టెన్ కోహ్లికి బాగా కలిసొచ్చిన వేదికల్లో విశాఖపట్నం ఒకటి. ఇక్కడ ఒక టెస్టు, 4 వన్డేల్లో కలిపి 647 పరుగులు సాధించాడు. 4 వన్డేల్లో వరుసగా 118, 117, 99, 65.. ఒక టెస్టులో 167, 81 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, October 24, 2018, 12:38 [IST]
Other articles published on Oct 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+