For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాపై ప్రశంసలు కురిపిస్తోన్న దిగ్గజాలు

Asia Cup 2018 : Wishes Pour In For India But Questions Remain Over Middle-Order Woes
Wishes pour in for India but questions remain over middle-order woes

న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో భారత్ విజేతగా నిలిచింది. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియానే కప్‌ను గెలిచింది. ఈ క్రమంలో శుక్రవారం బంగ్లా‌దేశ్‌తో జరిగిన హోరాహోరీ సమరంలో మూడు వికెట్ల తేడాతో ఏడోసారి ఆసియా కప్‌ను చేజిక్కుంచుకుంది. టోర్నీ ఆద్యంతం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు.. ఫైనల్‌లో కాస్త తడబడింది.

లక్ష్యం 223 అంత పెద్దది కాకపోయినప్పటికీ కాస్త కంగారులోనైంది. తన పోరాటాన్ని ఆఖరి బంతి వరకూ కొనసాగించింది. ఈ సందర్భంగా టీమిండియాను పలువురు ప్రముఖులు అభినందించారు. అటు ఫైనల్‌లో టీమిండియాకు చివరి బంతి వరకూ గట్టి పోటినిచ్చిన బంగ్లాదేశ్‌ జట్టుపై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.

ఆసియా కప్‌ విజేత టీమిండియాకు అభినందనలు. బంగ్లాదేశ్‌కు విజయం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. కానీ కీలక ఆటగాళ్లు లేకపోయినా బంగ్లా జట్టు ఎంతో ధైర్యంగా ఆడింది.

ఆసియాకప్‌ ఛాంపియన్స్‌కు అభినందనలు. కీలక సమయంలో ఉత్తమ ప్రదర్శన చేసిన కేదార్‌ జాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. బంగ్లా కూడా చాలా బాగా ఆడింది. షకీబ్‌, తమీమ్‌ లాంటి ఆటగాళ్లు లేకపోయినా ఎక్కడా నమ్మకాన్ని కోల్పోకుండా విజయం కోసం పోరాడింది.

కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా. టోర్నీ మొత్తంలో బౌలర్లు ఎంతో మాయ చేశారు. ఈ గెలుపునకు ప్రధాన కారణం వారే. ఫైనల్‌ మ్యాచ్‌ను ఎంతో ఉత్కంఠభరితంగా మార్చిన బంగ్లాదేశ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. వెల్‌డన్‌

1
44058

ఆసియా కప్‌ విజేత టీమిండియాకు అభినందనలు. కానీ బంగ్లాదేశ్‌ను తప్పకుండా అభినందించాలి. గొప్పగా పోరాడారు. నేడు క్రికెట్‌ గెలిచింది.

Story first published: Saturday, September 29, 2018, 12:09 [IST]
Other articles published on Sep 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+