For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చట్టబద్ధమైన హెచ్చరిక: గుండెజబ్బు ఉన్న వారు ఆ మ్యాచ్‌లు చూడొద్దంటోన్న ప్రీతిజింతా:ఎందుకంటే?

Wish our team wouldn’t give heart attacks to people in the name of cricket, says Preity Zinta

షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఐపీఎల్-2020లో రాన్రాను మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్ నుంచి పెట్టేబేడా సర్దుకునే స్థాయిలో ఉన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు.. తానూ పోటీలో ఉన్నాననే సంకేతాన్ని ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తనకంటే బలంగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ను ఓడించి.. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. క్రిస్ గేల్ రాకతో మున్ముందు ఎలాంటి జట్టునయినా ఓడించే దూకుడును ప్రదర్శిస్తోంది.

నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో.. గెలిస్తే రసవత్తరమే

నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో.. గెలిస్తే రసవత్తరమే

షార్జాలో గురువారం రాత్రి నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లలో ఆ పోరాటతత్వం ప్రస్ఫూటమైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో మ్యాచ్ గెలిచిందంటే.. ఇక మిగిలిన జట్లన్నీ మేల్కొవాల్సిందే. కేెఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ టీమ్.. తన తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదే ఊపును పంజాబ్ కింగ్స్ గనక కొనసాగించితే.. ముంబై ఇండియన్స్‌ను ఓడించడం పెద్ద కష్టమైన పనేమీ కాకపోవచ్చు.

చావోరేవో అనే రేంజ్‌లో..

చావోరేవో అనే రేంజ్‌లో..

క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక అగర్వాల్, నికొలస్ పూరన్.. నిలదొక్కుకోగలిగితే.. భారీ స్కోరును లక్ష్యంగా నిర్దేశించగలరు. ప్రత్యర్థిని ఉంచిన లక్ష్యాన్నీ అందుకోగలరు. పంజాబ్ కింగ్స్ లైన్‌లోకి రావడంతో మున్ముందు జరిగే మ్యాచ్‌లు ఉత్కంఠతగా మారడం ఖాయం. కనీసం నాలుగు జట్లు ప్లేఆఫ్‌లో అడుగు పెట్టడానికి గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇబ్బందుల్లో పడతాయి. ప్రతీ మ్యాచ్ కూడా చావోరేవో అనే పరిస్థితి వస్తుంది.

గుండెజబ్బు ఉన్నవాళ్లు చూడొద్దంటూ..

ఇలాంటి పరిణామాల మధ్య కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మ్యాచ్‌లను గుండెజబ్బు ఉన్న వాళ్లు చూడొద్దంటూ స్టాచ్యుటరీ వార్నింగ్‌ను జారీ చేసింది.. ఆ టీమ్ మేనేజ్‌మెంట్. ఉత్కంఠభరితంగా సాగే తమ జట్టు మ్యాచ్‌ను చూసి గుండెపోటును కొని తెచ్చుకోవద్దంటూ పంజాబ్ టీమ్ ఫ్రాంఛైజీ ప్రీతిజింతా ఉచిత సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. క్రికెట్ పేరుతో తమ జట్టు ఎవరికీ గుండెపోటుకు గురి చేయబోదని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

షార్జా మ్యాచ్‌తో ఫిదా..

షార్జా మ్యాచ్‌తో ఫిదా..

షార్జా స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ తనను కట్టి పడేసిందని ప్రీతిజింతా వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఓ అద్భుత విజయాన్ని తాము అందుకున్నామని చెప్పారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో అవసరమని అన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఢీ కొట్టి మరీ క్రీజ్‌లో నిలిచారని ప్రశంసించారు. మున్ముందు జరిగే అన్ని మ్యాచుల్లోనూ ఇదే తరహా విజయాన్ని అందుకోవాలని ఆమె అకాంక్షించారు.

చివరి ఓవర్‌లో హైటెన్షన్..

చివరి ఓవర్‌లో హైటెన్షన్..

ఇలా చివరి బంతి వరకూ మ్యాచ్ సాగడం పంజాబ్ టీమ్ మేనేజ్‌మెంట్‌, సపోర్టింగ్ స్టాఫ్‌నూ ఉత్కంఠతకు గురి చేసింది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్‌ను గెలవాల్సిన దశలో ఉంది పంజాబ్ టీమ్. ప్రతి మ్యాచ్‌ కూడా చావో రేవో తేల్చుకునే స్థాయికి చేరుకుంది. గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌ చివరి బంతి వరకూ సాగడం, చివరి ఆరు బంతులకు రెండు పరుగులు చేయాల్సిన స్థాయిలో వికెట్‌ను కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠతగా మారింది. నికొలస్ పూరన్ చివరి బంతికి సిక్స్‌ను బాదేంత వరకూ పంజాబ్ టీమ్ మేనేజ్‌మెంట్, సపోర్టింగ్ స్టాఫ్ ఊపిరి పీల్చుకోలేకపోయింది.

Story first published: Friday, October 16, 2020, 10:23 [IST]
Other articles published on Oct 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+