2003 వరల్డ్‌కప్ టీమ్‌లో ధోనీ ఉంటే బాగుండేది: ఆటోబయోగ్రఫీలో దాదా

హైదరాబాద్: భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. స్వదేశంలోనే కాదు విదేశీ గడ్డపై కూడా భారత జట్టు విజయాలు సాధించగలదని ప్రపంచానికి తెలియజేశాడు. జట్టులోని ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు దూకుడుగా ఎలా ఆడాలో నేర్పించాడు.
గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా అనేక ద్వైపాక్షిక సిరిస్‌లను నెగ్గడంతో పాటు 2003 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు కూడా చేరింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. గంగూలీ నేర్పించిన దూకుడే 2011లో ధోని నేతృత్వంలోని టీమిండియా రెండోసారి వరల్డ్ కప్‌ను గెలిచేలా చేసింది.
1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ తన తొలి వరల్డ్ కప్‌ను గెలవగా... 2011లో ధోని కెప్టెన్సీలోని టీమిండియా రెండోసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా 2003 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. అయితే ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.

ధోని ఉంటే పరిస్థితి మరోలా
15 ఏళ్ల తర్వాత ఆ ఓటమిపై గంగూలీ తన ఆటోబయోగ్రఫీ 'ఎ సెంచురీ ఈజ్ నాట్ ఇనఫ్' అనే పుస్తకం సందర్భంగా స్పందించాడు. అప్పటి వరల్డ్ కప్ జట్టులో ధోనీలాంటి ఆటగాడు ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ధోని గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు దాదా వెల్లడించాడు.

ధోనిని మూడో స్థానంలో ప్రమోట్ చేసిన గంగూలీ
2005లో గంగూలీ కెప్టెన్సీలోనే మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ వన్డే క్రికెట్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ధోని కోసం దాదా తన స్థానాన్ని కూడా త్యాగం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనిని మూడో స్థానంలో ప్రమోట్ చేశాడు. ధోని వన్డేల్లో నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 పరుగులు గంగూలీ కెప్టెన్సీలో చేసినవే కావడం విశేషం.

2003లోనే ధోనిని జట్టులోకి రమ్మని ఆహ్వానించా
2003లోనే ధోనిని జట్టులోకి రమ్మని ఆహ్వానించిన విషయాన్ని గంగూలీ ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. 'ఒత్తిడిలోనూ నిలకడగా ఆడే ప్లేయర్స్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే ప్లేయర్స్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా. ఆ సమయంలో నేను అనుకున్న లక్షణాలు ధోనిలో కనిపించాయి' దాదా పేర్కొన్నాడు.

టికెట్ కలెక్టర్‌గానే ఉన్నట్లు తెలిసింది
'ధోని నా 2003 వరల్డ్‌కప్ జట్టులో ఉంటే బాగుండేదని అనుకున్నా. సరిగ్గా 2003 వరల్డ్ కప్ సమయం. దాంతో ధోనిని జట్టులోకి రమ్మని ఆహ్వానించా. కానీ మేం వరల్డ్‌కప్ ఫైనల్ ఆడుతున్న సమయంలో అతను ఇంకా టికెట్ కలెక్టర్‌గానే ఉన్నట్లు తెలిసింది. ఇది నమ్మలేని విషయం' అని గంగూలీ అన్నాడు.

నాతో ధోని అన్నమాటకు ఆశ్చర్యపోయా
'నాతో ధోని అన్నమాటకు ఆశ్చర్యపోయా. అయితే నా మాటను ధోని పరిగణలోకి తీసుకున్నది 2004లో. జట్టులోకి వచ్చిన తొలి రోజు నుంచే ధోని ముద్ర కనిపించింది. 2011 వరల్డ్‌కప్ విజయంతో అతని స్థాయి ఆకాశాన్ని తాకింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ధోనీ గురించి నేను సరిగ్గా అంచనా వేశాను. అతను అన్ని అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి చేరాడు' అని గంగూలీ తన పుస్తకంలో తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications