
టెస్టుల్లో వేగంగా 200 వికెట్లు:
రవీంద్ర జడేజా గత రెండేళ్లలో బంతి, బ్యాటుతో పాటు ఫీల్డింగ్‌లోనూ విశేషంగా రాణించాడు. టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తర్వాత అత్యంత వేగంగా టెస్టుల్లో 200 వికెట్లు (44 టెస్టులు) పడగొట్టిన భారత బౌలర్‌గా నిరుడు జడేజా ఘనత సాధించాడు. క్రిక్‌విజ్ అనే టూల్ సహకారంతో గణాంకాలను విశ్లేషించడం ద్వారా విజ్డన్.. జడేజా విలువను తేల్చింది. ఈ విశ్లేషణ ప్రకారం జడేజా ఎంవీపీ (మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్) రేటింగ్ 97.3. మురళీధరన్ మాత్రమే అతడికన్నా ముందున్నాడు.

వాట్సన్ టెస్టు సగటు కంటే ఎక్కువ:
2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జడేజా మూడేళ్ల వరకూ టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. కానీ 2012లో ఇంగ్లండ్‌పై తొలి టెస్టు ఆడిన జడేజా.. ఆ తర్వాత తిరుగు చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. స్పిన్ ఆల్‌రౌండర్ ఎదిగిన జడేజా.. మిడిలార్డర్‌లో నమ్మదిగిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా టెయిలెండర్లతో కలిసి ఎన్నోసార్లు భారత్‌కి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. ఇప్పటి వరకూ 49 టెస్టులాడి 35.26 సగటుతో 1,869 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండన్ షేన్ వాట్సన్ టెస్టు సగటు 35.2 కంటే ఇది ఎక్కువ.

49 టెస్టుల్లో 1869 పరుగులు:
31 ఏళ్ల రవీంద్ర జడేజా ఇప్పటివరకు 49 టెస్టుల్లో 1869 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధశతకాలు, ఓ శతకం ఉన్నాయి. 2018లో వెస్టిండీస్‌పై ఆ సెంచరీ చేసాడు. అతడి ఖాతాలో 213 వికెట్లు ఉన్నాయి. ఇందులో నాలుగు సార్లు ఎనిమిది వికెట్లు, తొమ్మిది సార్లు ఐదు వికెట్లు, ఒకసారి 10 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 2.44 ఎకానమీ, 24.63 సగటు ఉంది.

జడేజా నాణ్యమైన ఆల్‌రౌండర్:
'స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జడేజా అత్యంత విలువైన భారత ఆటగాడిగా నిలవడం ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే అతడు టెస్టులో చోటు ఖాయంగా ఉన్న ఆటగాడు కాదు. కానీ ఎప్పుడు ఆడినా ప్రధాన బౌలర్‌గా ఉంటాడు. బ్యాటుతోనూ ఎంతో విలువైన పరుగులు చేస్తాడు. జడేజా బౌలింగ్ సగటు (24.62).. షేన్ వార్న్ (35.26) సగటు కన్నా మెరుగు. అతడి బ్యాటింగ్ సగటు (35.26).. వాట్సన్ కన్నా ఎక్కువ. జడేజా నాణ్యమైన ఆల్‌రౌండర్' అని క్రిక్‌విజ్‌కు చెందిన ఫ్రెడ్డీ విల్డే చెప్పాడు.


Click it and Unblock the Notifications

టీమిండియా ఇప్పుడిలా ఉందంటే ఆ మ్యాచే కారణం: కోహ్లీ










