
కెప్టెన్‌గా రోహిత్
లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లు ఇద్దరే. ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కాగా.. మరొకరు ఓపెనర్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ జట్టును హిట్‌మ్యాన్ నాలుగుసార్లు విజేతగా నిలపగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని మహీ మూడు సార్లు విజేతగా నిలిపాడు. మహీ మూడు టైటిల్‌లే అందించినా.. చెన్నైని ప్రతిసారి సెమీస్ వరకు తీసుకొచ్చాడు. ఇద్దరిలో ఎవరిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలో కష్టమే అయినా.. రోహిత్ సాధించిన విజయాలను బట్టి అతనికే 'విజ్డెన్' నాయకత్వం అప్పగించింది.

నాలుగో స్థానంలో కోహ్లీ
హిట్‌మ్యాన్‌కు జతగా క్వింటన్ డికాక్‌ను మరో ఓపెనర్‌గా తీసుకుంది. కీలకమైన మూడో స్థానంలో సీనియర్ ఆటగాడు సురేశ్ రైనాను ఎంపిక చేసింది. చెన్నై తరఫున రైనా మూడో స్థానంలో పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఇక నాలుగో స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది.

వికెట్‌కీపర్‌గా ధోనీ
ఐదో స్థానానికి ధోనీని తీసుకుంది. అంతేకాదు అతడికే వికెట్‌కీపర్ బాధ్యతలు అప్పగించింది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, సునిల్ నరైన్‌లకు చోటు కల్పించింది. భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగలు పేస్ విభాగంలో ఎంపికయ్యారు. రిజర్వ్ ఆటగాడిగా డ్వేన్ బ్రావోను ఎంచుకుంది. విజ్డెన్ ఐపీఎల్ జట్టులో ముంబై నుంచి నలుగురు, చెన్నై నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఎంపికయ్యారు.

విజ్డెన్ ఐపీఎల్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సునిల్ నరైన్, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, డ్వేన్ బ్రావో (12వ ఆటగాడు).


Click it and Unblock the Notifications












