Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ ఫైనల్‌ను తలపించిన కెనడా లీగ్.. సూపర్‌ ఓవర్‌లో విన్నిపెగ్‌ విజయం

Winnipeg Hawks beat Vancouver Knights in Super Over to clinch inaugural Global T20 Canada

ఒంటారియో: గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌ ఫైనల్ మ్యాచ్ దాదాపు ప్రపంచకప్‌-2019 ఫైనల్ మ్యాచ్‌ను తలపించింది. ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్, సూపర్‌ ఓవర్‌ టై కాగా.. గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ మాత్రమే టై అయినా ఉత్కంఠ రేపింది. ఆదివారం వాంకోవర్‌ నైట్స్‌తో జరిగిన ఫైనల్‌లో విన్నిపెగ్‌ హాక్స్‌ సూపర్ ఓవర్‌లో విజయాన్ని సాధించి లీగ్ మొదటి ఛాంపియన్‌గా నిలిచింది.

 అన్వర్‌ షో:

అన్వర్‌ షో:

ముందుగా బ్యాటింగ్‌ చేసిన విన్నీపెగ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. షైమన్‌ అన్వర్‌ (45 బంతుల్లో; 90) రాణించాడు. క్రిస్ లిన్ (37), డుమిని (33) పరుగులు చేశారు. వాంకోవర్‌ నైట్స్‌ తరఫున విండీస్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్ 4 వికెట్లు తీసాడు. అలీ ఖాన్, రాయన్ పఠాన్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

మ్యాచ్‌ టై:

మ్యాచ్‌ టై:

లక్ష్య ఛేదనలో వాన్‌కూవర్‌ నైట్స్‌ కూడా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 192 పరుగులే చేసింది. నైట్స్‌ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ ( 36 బంతుల్లో; 64) హాఫ్‌ సెంచరీ సాధించగా.. రసెల్‌ (20 బంతుల్లో; 46 నాటౌట్) చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.

సూపర్‌ ఓవర్‌లో విజయం:

వాంకోవర్‌ నైట్స్‌ ముందుగా సూపర్‌ ఓవర్‌ ఆడి రెండు వికెట్ల నష్టానికి తొమ్మిది పరుగులు చేసింది. ఇందులో రసెల్‌ ఏడు పరుగులు చేసాడు. అనంతరం 10 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విన్నీపెగ్‌ కేవలం నాలుగు బంతుల్లోనే విజయాన్ని అందుకుంది. క్రిస్‌ లిన్‌ ఐదు పరుగులు చేయగా.. రహ్మాన్‌ ఒక పరుగు చేశాడు. రసెల్‌ వేసిన ఈ సూపర్‌ ఓవర్‌ మూడో బంతికి నాలుగు పరుగులు బైస్‌ రావడంతో విన్నీపిగ్‌ సునాయాస విజయాన్ని అందుకుంది.

చాలా ఎంజాయ్ చేసా:

అద్భుత ఇన్నింగ్స్ ఆడైన అన్వర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. డుమిని 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపికయ్యారు. డుమిని 8 మ్యాచులలో 332 పరుగులు చేసాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 'ఈ సీజన్ మొత్తం జట్టు అంతా బాగా రాణించింది. ప్రతి ఒక్కరు అద్భుతమైన ప్రదర్శన చేశారు. నను చాలా ఎంజాయ్ చేసాను. యువకులతో అనుభవాన్ని పంచుకోవడం చాలా ముఖ్యం' అని డుమిని పేర్కొన్నాడు.

Story first published: Monday, August 12, 2019, 13:20 [IST]
Other articles published on Aug 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+