For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కెరీర్‌లో మిగిలింది అదొక్కటే: రిటైర్మెంట్‌పై షోయబ్ మాలిక్

By Nageshwara Rao
Winning 50-over World Cup the only thing missing, says Shoaib Malik

హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వెల్లడించాడు. తాజాగా తన రిటైర్మెంట్ గురించి షోయబ్ మాలిక్ మీడియాతో మాట్లాడాడు.

"నాకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. అందులో ఒకటి 2019 వరల్డ్ కప్ గెలవడం. నా చివరి 50 ఓవర్ల టోర్నీ కూడా అదే కావొచ్చు. ఆ తర్వాత నేను ఫిట్‌గా ఉంటే టీ20 క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తా. నా క్రికెట్‌ కెరీర్‌లో రెండు పెద్ద టోర్నమెంట్‌లు గెలిచిన దాంట్లో సభ్యుడిని" అని తెలిపాడు.

"ఒకటి 2009 టీ20 వరల్డ్ కప్ కాగా, రెండోది 2017 చాంపియన్స్ ట్రోఫీ. ఇక నా కెరీర్‌లో మిగిలి ఉంది 50 ఓవర్ వరల్డ్ కప్ మాత్రమే. దాని కోసమే నేను కృషి చేస్తున్నాను. నాకు మా జట్టుపై నమ్మకం ఉంది. ఆ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం" అని షోయబ్ మాలిక్ అన్నాడు.

షార్జా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షోయబ్ మాలిక్ 1998లో తన తొలి మ్యాచ్‌ని ఆడాడు. 2007లో పాకిస్తాన్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన మాలిక్ తన కెరీర్‌లో ఆడిన 261 వన్డేల్లో 35.22 యావరేజ్‌తో 6975 పరుగులు చేశాడు.

ఇందులో 9 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆల్ రౌండర్‌గా పేరొందిన షోయబ్ మాలిక్ బౌలింగ్‌లో 154 వికెట్లు తీశాడు. ఇక, 2015లో టెస్టులకు షోయబ్‌ గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో షోయబ్ మాలిక్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 245 పరుగులు.

త్వరలో పాకిస్థాన్ జట్టు జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో కలసి ముక్కోణపు సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్ జులై 1 నుంచి జులై 8 వరకు జరగనుంది. ఈ ముక్కోణపు సిరిస్ ముగిసిన తర్వాత జింబాబ్వేతో పాకిస్థాన్ ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. ఈ ఐదు వన్డేలకు బులవాలోని క్వీన్స్ క్లబ్ వేదిక కానుంది.

ముక్కోణపు సిరిస్‌కు పాకిస్థాన్ జట్టు:
Fakhar Zaman, Muhammad Hafeez, Shoaib Malik, Asif Ali, Hussain Talat, Sarfraz Ahmad (captain/wicket-keeper), Harris Sohail, Shadab Khan, Muhammad Nawaz, Faheem Ashraf, Hassan Ali, Muhammad Amir, Usman Khan Shinwari, Shaheen Shah Afridi and Sahibzada Farhan.

జింబాబ్వేతో ఐదు వన్డేల సిరిస్‌కు పాకిస్థాన్ జట్టు:
Fakhar Zaman, Imam ul Haq, Muhammad Hafeez, Shoaib Malik, Baber Azam (subject to fitness), Asif Ali, Sarfraz Ahmed (captain/wicket keeper), Muhammad Nawaz, Shadab Khan, Faheem Ashraf, Muhammad Amir, Junaid Khan, Usman Khan Shinwari, Yasir Shah, Hassan Ali and Harris Sohail.

Story first published: Tuesday, June 26, 2018, 15:02 [IST]
Other articles published on Jun 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+