న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మోడల్ ను పెళ్లి చేసుకున్న క్రికెటర్..

డొమినిక్ రిపబ్లిక్ : ప్రమాదకర ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న విండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్ జాసిమ్ ను వివాహం చేసుకుని తన బ్యాచులర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు.

డొమినిక్ రిపబ్లిక్ కు చెందని జాసిమ్ అనే మోడల్ తో రసెల్ శుక్రవారం నాడు రసెల్ వివాహం జరిగింది. చాలా ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 2014లో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. తన పెళ్లి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన రసెల్.. 'ఏ విషయంలోనైనా దేవుడినే ముందుండేలా చూసుకోవాలి.. ఆయనే మార్గం చూపిస్తాడు' అంటూ ఫోటోకు కామెంట్ జత చేశాడు.

ఇక క్రికెటర్ గా రసెల్ నేపథ్యం కూడా ఆసక్తికరంగా మారింది. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ చేతబట్టిన రసెల్ తల్లి ఎంత వద్దని చెప్పినా.. మైదానంలోకి అడుగుపెట్టకుండా ఉండేవాడు కాదు. తండ్రికి కూడా రసెల్ క్రికెట్ ఆడడం ఇష్టం లేకపోయినా.. రసెల్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఆటపైనే ఫోకస్ చేస్తూ వచ్చాడు. అలా డొమెస్టిక్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్ గా సత్తా చాటాడు.

windies all rounder Andrew Russell married his girlfriend

సందిగ్ధంలో క్రికెట్ కెరీర్?

ప్రస్తుతం ఆండ్రీ రసెల్ క్రికెట్ కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. డోపింగ్ టెస్టులకు హాజరు కానీ కారణంగా అతనిపై రెండేళ్ల వరకు నిషేధం పడే అవకాశం ఉంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (డబ్యూఏడీఏ) నియామావళి ప్రకారం ప్రతీ అథ్లెట్ ఏడాదిలో మూడుసార్లు డోపింగ్ టెస్టులకు హాజరు కావాలి. కానీ రసెల్ మాత్రం డోపింగ్ టెస్టులకు హాజరుకావడం లేదు.

దీంతో విషయాన్ని తీవ్రంగా పరిగణించిన యాంటీ డోపింగ్ ఏజెన్సీ రసెల్ డోపింగ్ గైర్హాజరీపై విచారణకు ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే డోపింగ్ టెస్టులకు డుమ్మా కొట్టినట్టే రెండేళ్ల పాటు ఏ అంతర్జాతీయ సిరీస్ లో ఆడకుండా అతనిపై నిషేధం పడుతుంది. రసెల్ ఐపీఎల్ లో కోల్ కతా తరుపున ఆడుతోన్న విషయం తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X